మగాళ్లపై జాలి చూపండి..వాళ్లకి లైంగిక వేధింపులు

Update: 2018-12-25 01:30 GMT
ఆకు వెళ్లి ముల్లు మీద పడ్డా - ముల్లు వెళ్లి ఆకు మీద పడ్డా.. నష్టం ఆకుకే అనే సామెతలా.. ఆడామగా విషయంలో తప్పు ఎవరిదైనా.. ఈ సమాజం మాత్రం మగాడిదే తప్పు అంటుంది. ఆడవారిపై జాలి చూపిస్తుంది. ఆడవారిపైనే కాదు.. మగాళ్లపైన కూడా జాలిచూపించాలని.. వారికీ కొన్ని కొన్ని సందర్భాల్లో లైంగిక వేధింపులు తప్పడం లేదని సంచలన స్టేట్‌మెంట్‌ ఇచ్చింది తెలుగమ్మాయి - కమల్‌ హాసన్‌ మాజీ సహజీవని గౌతమి.

ఇప్పుడు ఇండస్ట్రీలో మీటూ ఉద్యమం పుణ్యామా అంటూ.. చాలామంది హీరోయిన్స్‌ తాము ఎదుర్కున్న దారుణాల్ని ఒక్కొక్కటిగా బయటపెడుతున్నారు. ఇంకా చెప్పాలంటే మీటూ ఉద్యమం వల్లే ఇండస్ట్రీలో ఉన్న చాలామంది మృగాళ్ల అసలు రూపం బయటపడింది. ఇప్పుడు ఈ మీటూ ఉద్యమంపై తొలిసారిగా మాట్లాడింది గౌతమి. లైంగిక వేధింపులు అనేవి ఆడవాళ్లకే కాదు.. మగవారికి కూడా ఉన్నాయంటూ పేర్కొంది. అయితే.. అవి ఎవ్వరూ చెప్పుకోలేరని.. చెప్పినా మన సమాజం నమ్మే పరిస్థితి లేదని చెప్పుకొచ్చింది. మగాళ్లపైనే కాకుండా.. చిన్నారులపైన కూడా లైంగిక వేధింపులు ఎక్కువయ్యాయని అభిప్రాయపడింది. ఇన్నాళ్లూ మహిళలపై వేధింపుల గురించే అందరూ మాట్లాడారు. తొలిసారిగా.. మగాళ్ల కష్టాల గురించి మాట్లాడిన గౌతమికి అందరూ ఒక ఓహో వేసుకోవాల్సిందే.. ఏమంటారు.
Tags:    

Similar News