చిత్ర పరిశ్రమకు మాఫియాకు చాలావరకు లింకులున్నాయనే ఆధారాలు ఎన్నోసార్లు బయటపడ్డాయి. గ్లామర్ ఫీల్డ్ కావడంతో మాఫియా చిత్రసీమను గుప్పిట్లో పెట్టుకొని తన పనులు చేయించుకోవాలని చూస్తోంది. ఈ నేపథ్యంలోనే వీరిని దారికి తెచ్చుకునేందుకు డ్రగ్స్ అలవాటు చేస్తుందనే ప్రచారం జరుగుతోంది. ఇందులో భాగంగా పలువురిని డ్రగ్స్ కు వ్యసనపరులుగా.. మరికొందరని డగ్స్ సప్లై చేసే వ్యక్తులుగా వాడుకుంటోంది.
అయితే పోలీసులు డ్రగ్స్ ను కట్టడి చేసే ప్రయత్నంలో భాగంగా గట్టి నిఘా పెడుతోంది. ఈ నేపథ్యంలోనే డ్రగ్స్ సరఫరా చేస్తున్న ముఠా సభ్యులను ఒక్కొక్కరికి అదుపులోకి తీసుకొని కటకటాల్లోకి పంపిస్తున్నారు. ఈ క్రమంలోనే డ్రగ్స్ తో సంబంధం ఉన్న పలువురు సినీ.. రాజకీయ ప్రముఖులు.. వారి పిల్లల పేర్లు సైతం బయటికి వస్తున్న సంగతి తెల్సిందే. బాలీవుడ్.. టాలీవుడ్.. కోలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన అనేక మంది నటీనటుల ఇప్పటికే డ్రగ్స్ విచారణలో పాల్గొంటున్నారు.
తాజాగా సినీ నటి నేహా దేశ్ పాండే భర్తను పోలీసులు అరెస్టు చేశారు. అతడి అరెస్ట్ వెనుక డ్రగ్స్ కోణం ఉందని తెలుస్తోంది. దేశంలోని ప్రముఖ ఈవెంట్లకు డీజే సప్లయర్ గా మోహిత్ అగర్వాల్ అలియస్ మైరోన్ మోహిత్ ముందుంటాడు. ఆయన భార్య నేహా దేశ్ పాండే పలు టాలీవుడ్.. బాలీవుడ్లో హీరోయిన్ గా నటించింది. కాగా మోహిత్ అగర్వాల్ డీజే ముసుగులో ఈవెంట్లలో డ్రగ్స్ సరఫరా చేసేవాడని పోలీసులు గుర్తించారు.
గోవాకు చెందిన డ్రగ్స్ డాన్ ఎడ్విన్ నుంచి మాదక ద్రవ్యాలు కొనుగోలు చేసి వాటిని తన ఈవెంట్లకు వచ్చే వారికి సరఫరా చేసే వారని పోలీసులు విచారణలో వెలుగు చూడటం సంచలనంగా మారింది. 2014లో ది అన్ స్క్రిప్టెడ్ సంస్థను ఏర్పాటు చేసిన మోహిత్ హైదరాబాద్.. గోవా.. బెంగుళూరులోని పలు ఈవెంట్ల్స్.. పబ్స్.. డీజేలను సరఫరా చేస్తున్నాడు. ఆయా పబ్ నిర్వాహకులతో కలిసి ప్రత్యేక రేవ్ పార్టీలు నిర్వహించేవాడు. ఇందుకోసం ఎడ్విన్ సహా 50 మంది డ్రగ్ పెడ్లర్లతో సంబంధం పెట్టుకొని ఖరీదైన కొకైన్ సరఫరా చేసేవాడని పోలీసులు గుర్తించారు.
గతేడాది అక్టోబర్ 2న పోలీసులు క్రూయిజ్ డ్రగ్ పార్టీపై దాడి చేసిన సమయంలో షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ సహా పలువురు డ్రగ్స్ కేసులో అరెస్టయ్యారు. ఆ సమయంలోనూ మోహిత్ అక్కడ ఉండగా అతడి వద్ద ఎలాంటి డ్రగ్స్ దొరకకపోవడంతో అతడిని పోలీసులు వదిలేశారు. ఈ క్రమంలోనే గోవాకు చెందిన డ్రగ్స్ డాన్ ఎడ్విన్ ను హెచ్ న్యూ అధికారులు నవంబర్ 5న విచారించగా మోహిత్ పేరు వెలుగులోకి వచ్చింది. అప్పటి నుంచి మోహిత్ ముంబై.. గోవాల్లో తలదాచుకుంటున్నాడు.
డిసెంబర్ 31న గోవాలో రెండు కోట్ల భారీ వ్యయంతో మోహిత్ ఈవెంట్ నిర్వహించినట్లు హెచ్ న్యూ పోలీసులకు సమాచారం వచ్చింది. పోలీసులు అక్కడికి చేరుకునే సమయానికి అతడు తప్పించుకొని హైదరాబాద్ పారిపోయాడు. ఈ క్రమంలోనే తాజాగా అతడిని హైదరాబాద్లో అరెస్టు చేసి అతడి నుంచి ఒక గ్రాము కొకైన్ స్వాధీనం చేసుకున్నారు. ఈ నేపథ్యంలోనే అతడిని కోర్టు ముందు హాజరు పరచి వారం రోజులు కస్టడీ కావాలని పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. మోహిత్ కు ఏయే పబ్స్ తో సంబంధాలు ఉన్నాయి? ఎవరెవరు డ్రగ్స్ తీసుకుంటున్నారు? నేహా దేశ్ పాండేకు ఇందులో ఏమైనా లింకులు ఉన్నాయా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.