చేతిలో చేయ్యేసి రాహుల్ గాంధీతో నడిచిన హీరోయిన్ పూనమ్ కౌర్.. వైరల్

Update: 2022-10-29 07:35 GMT
కన్యాకుమారి నుంచి కశ్మీర్ దాకా చేపట్టిన రాహుల్ గాంధీ జోడోయాత్ర ఇప్పుడు తెలంగాణలోకి కొనసాగుతోంది. ఇప్పటికే ఉదయం ఖమ్మం గిరిజన మహిళలతో కలిసి డ్యాన్స్ చేసిన రాహుల్ గాంధీ ఈరోజు ఉత్సాహంగా పాదయాత్రలో పాల్గొన్నారు. అయితే ఆశ్చర్యకరంగా ట్విట్టర్ లో హాట్ కామెంట్స్ చేస్తూ వార్తల్లో నిలిచే హీరోయిన్ పూనమ్ కౌర్ సడెన్ గా రాహుల్ గాంధీ పాదయాత్రలో కనిపించడం.. అదీ రాహుల్ చేతిలో చేయి వేసి మరీ పాదయాత్ర చేయడం హాట్ టాపిక్ గా మారింది.

కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ తెలంగాణలో నాలుగో రోజు  పాదయాత్ర చేపట్టారు. మహబూబ్ నగర్ నుంచి జడ్చర్ల వరకు పాదయాత్ర చేస్తున్నారు. ధర్మాపూర్‌లో ప్రారంభమైన ఈ పాదయాత్రలో రాహుల్ వెంట నటి పూనమ్ కౌర్ పాల్గొనడం అందరి దృష్టిని ఆకర్షించింది.

సాధారణంగా సోషల్ మీడియాలో రాజకీయాలపై తన అభిప్రాయాలను వెల్లడించడంలో యాక్టివ్‌గా ఉండే పూనమ్ కౌర్ రాహుల్ గాంధీతో కలిసి పాదయాత్రలో పాల్గొని అందరినీ ఆశ్చర్యపరిచింది. అంతే కాదు రాహుల్ గాంధీతో పాటు ఆయన చేయిలో చేయి కలుపుతూ నడుస్తూ అందరిని తనవైపు తిప్పుకునేలా చేసింది.

రాష్ట్రంలోని చేనేత కార్మికుల సమస్యల గురించి పూనమ్ కౌర్ పాదయాత్రలో నడుస్తూ రాహుల్ గాంధీతో మాట్లాడినట్లు సమాచారం. అందుకే చేనేతలు నేసిన సాదా కాటన్ తెల్లటి చీరను ధరించి కనిపించింది. త్వరలో సోనియా గాంధీని కలవాలని పూనమ్‌కు రాహుల్ సూచించారని తెలిసింది.

ప్రస్తుతం రాహుల్, పూనమ్‌లు చేయిలో చేయ్యి వేసి నడిచిన ఫోటోలు ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది. ఇటీవల పూనమ్ కౌర్ ఆంధ్రప్రదేశ్ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేందర్ రెడ్డిని కొన్ని కఠినమైన ప్రశ్నలను సంధించి ఏపీ సర్కార్ కు షాక్ ఇచ్చింది. అదే కార్యక్రమంలో తెలంగాణలో చేసిన కృషికి కేటీఆర్‌ను అభినందిస్తూ వార్తల్లో నిలిచింది. ఇప్పుడు సడెన్ గా రాహుల్ గాంధీ పాదయాత్రలో పాల్గొని షాకిచ్చింది.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News