భారతదేశంలో హిందూత్వ అన్నివేళలా హాట్ టాపిక్. ఇటీవలే రాజస్థాన్ లో టైలర్ కన్హయ్య హత్యోదంతం మరోసారి పాక్ తీవ్రవాద మూలాలను బహిర్గతం చేయడంతో ఇప్పుడు మరోసారి హిందూత్వ వాదం తెరపైకి బలంగా వచ్చింది. టైలర్ హత్య అనంతరం రాష్ట్రం భగ్గుమంది. మహ్మద్ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన భారతీయ జనతా పార్టీ మాజీ నాయకురాలు నుపుర్ శర్మకు అనుకూలంగా కామెంట్స్ చేశారనే కారణంతో గౌస్ మహ్మద్ రియాజ్ అఖ్తారీ అనే ఇద్దరు కన్హయ్యలాల్ ను హత్య చేయడం సంచలనమైంది.
అనంతరం ఆ ఇద్దరినీ అరెస్ట్ చేయడంతో పాక్ తీవ్రవాద మూలాలు బయటపడ్డాయి. ఉగ్రవాద చర్య అనే కోణంలో దర్యాప్తు కొనసాగడంతో కొన్ని నిజాలు బయటపడుతున్నాయి. హత్య చేసిన నిందితులకు పాకిస్థాన్ ఇస్లామిక్ సంస్థతో సంబంధాలు పాకిస్తాన్ కేంద్రంగా కార్యకలాపాలను నిర్వహిస్తోన్న దావత్-ఇ-ఇస్లామీ అనే కరడుగట్టిన మత ఛాందసవాద సంస్థతో వారికి సంబంధాలున్నాయనే అనుమానాలు దర్యాప్తు సంస్థలు వ్యక్తం చేస్తున్నాయి. సదరు సంస్థ నడిపించే ఛానల్ ద్వారా నిందితులు ప్రభావితం అయ్యారనే అభిప్రాయాలు ఉన్నాయి.
టైలర్ కన్హయ్య లాల్ హ్యతోదంతం అనంతరం హిందూ సంఘాల నిరసనలకు మద్ధతుగా నటి ప్రణీత సుభాష్ నిలిచారు.''హిందూ లైవ్స్ మ్యాటర్ (Hindu lives matter)" అని రాసివున్న ప్లకార్డ్‌ను ప్రదర్శించారు.ప్రస్తుతం ఈ ఫోటో అంతర్జాలంలో వైరల్ గా మారింది. ఈజ్ ఎనీ వన్ లిజనింగ్.. అనే కామెంట్ తో ఫోటోగ్రాఫ్ వైరల్ అవుతోంది. దీనికి నెటిజనుల నుంచి మద్ధతు లభించింది.
హిందూ టెర్రర్ పైనా బెరుకు లేకుండా..!ప్రణీత సుభాష్ 'హిందూ టెర్రర్'కి వ్యతిరేకంగా ఇంతకుముందు నినాదాలు చేసారు. సహనటి స్వర భాస్కర్ వివాదాస్పద వ్యాఖ్యలను అప్పట్లో ఖండించారు. నేటి ఆఫ్ఘనిస్తాన్ పరిస్థితిపై తన అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ స్వరా భాస్కర్ చేసిన వ్యాఖ్యలపై ప్రణీత తీవ్రంగా విరుచుకుపడ్డారు. భారత్ లోని క్షమాపణల ఫర్వం ఆఫ్ఘనిస్తాన్ లో ఏమి జరుగుతుందో వైట్‌వాష్ చేయడానికి 'హిందూ ఉగ్రవాదాన్ని' రక్షణగా ఉపయోగిస్తున్నారు. ఈ భావనను చట్టబద్ధం చేసే ప్రయత్నాలు వారి ఊహలుగా కల్పనగా మిగిలిపోతాయి. జాగ్రత్త..., భారత్! శత్రువులు హద్దులు దాటి దేశంలోనే ఉన్నారు. వారు మీ చుట్టూనే ఉన్నారు'' అంటూ వ్యాఖ్యానించారు.
మనం హిందుత్వ టెర్రర్ తో ఓకే కాదు. తాలిబాన్ టెర్రర్ తో అందరూ షాక్ అయ్యాం కానీ.. హిందుత్వ భీభత్సం పైనా ఆగ్రహం చెందండి! అంటూ స్వరా చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ గా ప్రణీత తనదైన శైలిలో విరుచుకుపడ్డారు.
ప్రణీత ప్రతిసారీ సామాజిక మాధ్యమాల్లో సమకాలీన సమస్యల గురించి క్రమం తప్పకుండా స్పందిస్తోంది. తాలిబాన్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆఫ్ఘనిస్తాన్ లో మహిళలపై జరుగుతున్న హింసపై ఆమె స్పందనలు వైరల్ అయ్యాయి. ఆఫ్ఘనిస్తాన్ లో తాలిబాన్ లచే అత్యాచారాలు.. బానిసలుగా ఉన్న యువతుల కథలు వినడానికి భయానకంగా ఉన్నాయి. ISAF రెండు దశాబ్దాల ఉనికి వల్ల ప్రయోజనం ఏమిటి? వారు అత్యంత దుర్బలమైన వారిని రక్షించలేకపోయారా? ఆఫ్ఘన్ ప్రజల భద్రత కోసం ప్రార్థిస్తున్నామని ప్రణీత సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు.
ప్రణిత కెరీర్ జర్నీ ఇలా..2021 మేలో తన చిరకాల మిత్రుడు నితిన్ రాజ్ ని వివాహం చేసుకున్న ప్రణీత పరేష్ రావల్ మరియు శిల్పా శెట్టిల హంగామా 2 లో అలాగే భుజ్: ది ప్రైడ్ ఆఫ్ ఇండియాలో కనిపించింది. కన్నడ చిత్రం పోర్కితో నటిగా కెరీర్ ని ప్రారంభించిన 28 ఏళ్ల ప్రణీత మహేష్ బాబు- పవన్ కళ్యాణ్- ఉపేంద్ర- జూనియర్ ఎన్టీఆర్- బాలకృష్ణ- సూర్య- శివరాజ్ కుమార్ - కార్తీ వంటి పెద్ద స్టార్ల సరసన నటించింది. 40 సినిమాలకు పైగా నటించింది.