దివ్య స్పందన/ రమ్య...నెటిజన్లకు ఈ పేరు సుపరిచితం. కాంగ్రెస్ సోషల్ మీడియా ఇన్ చార్జి. వివాదాస్పద ట్వీట్లు చేయడంలో ఆమె ముందుంటారు. ప్రధాని నరేంద్రమోడీని ఉద్దేశించి ఇలా కలకలం సృష్టించడంలో ఆమె తరచుగా వార్తల్లో నిలిచారు. రాఫెల్ డీల్ విషయంలో వచ్చిన ఆరోపణలపై ప్రధాని మోడీ స్పందించకపోవడంతో కొద్దికాలం క్రితం మోడీని దొంగగా అభివర్ణిస్తూ రమ్య ట్వీట్ చేశారు. ఇది వివాదాస్పదం అయింది. దేశపరువు దిగజార్చేలా రమ్య ట్వీట్ ఉందని - రమ్య ట్వీట్ దేశ ధిక్కారం కిందకు వస్తుందని లాయర్ కోర్టులో కేసు వేశారు. తాజాగా మరో వీడియోలో నరేంద్ర మోడీ మిస్టేక్స్ అంటూ ఓ వీడియో పోస్ట్ చేశారు. కింగ్ ఆఫ్ బ్లూపర్స్ కిరీటాన్ని మోడీ దక్కించుకున్నారని ఎద్దేవా చేస్తూ వివాదాస్పదం అయింది.
రమ్య వేసి వివాదాస్పద ట్వీట్ లో కీలక పోలిక ఉంది. `తొలుత 2014లో నరేంద్ర మోడీ హామీ ఇలా ఉంది - 2019లో ఇలా తయారయింది` అని ఓ బొమ్మతో కూడిన చిత్రం ఉంది. ఓ గుర్రం లాంటి బొమ్మను వేసి.. వెనుక వైపు ఓ భాగం - ముందు వైపు ఓ భాగంగా పేర్కొంటూ.. వెనుకవైపు బలంగా ఉన్న రెండు కాళ్లు - తోక ఉన్న దానిని చూపిస్తూ...2014లో మోడీ ఇలా హామీ ఇచ్చారని రమ్య పేర్కొన్నారు. దానికి ముందు వైపు ఉత్తి బొమ్మను ఉంచారు. మోడీ అప్పుడు అది చూపించి - ఇప్పుడు ఇలా తయారు చేశారని విమర్శలు గుప్పించారు. మరో ట్వీట్ లో కింగ్ ఆఫ్ బ్లూపర్స్ కిరీటాన్ని మోడీ దక్కించుకున్నారని ఎద్దేవా చేస్తూ ఈ పోస్ట్ చేశారు.``మోడీ బెస్ట్ వన్ మిస్టేక్స్ అంటూ ``మోహన్ లాల్ కరమ్ చంద్ గాంధీ' (మోహన్ దాస్ కరమ్ చంద్ గాంధీకి బదులు) అంటూ ఓ వీడియో వివాదాస్పదం చేశారు.
అయితే, రమ్య ట్వీట్ కు బీజేపీ సానుభూతిపరులు - నెటిజన్లు తీవ్రంగా స్పందించారు. రమ్య వేసినటువంటి చిత్రమే వేస్తూ రాహుల్ గాంధీ 2014లో అలా - ఇప్పుడు ఇలా తయారయ్యారని ఎద్దేవా చేశారు. కొందరు రెండు వైపులా బొమ్మనే వేసి.. 2014లో పప్పు ఫ్లాప్ అయ్యాక - 2019లో పప్పు ఫ్లాప్ అయ్యాక అంటూ పేర్కొన్నారు. వెనుక భాగం కాంగ్రెస్ వాళ్లు ఊహించుకునే రాహుల్ గాంధీ అని - ముందు భాగం అసలు రాహుల్ గాంధీ అని కౌంటర్లు ఇస్తున్నారు. రాహుల్ గాంధీని కాంగ్రెస్ నేతలు బలంగా చూస్తుంటే - ప్రపంచం మాత్రం ఆయనను బలం లేని వాడిగా చూపిస్తుందని మరొకరు రమ్య పోస్టుకు కామెంట్స్ పెట్టారు.