పారిశ్రామిక దిగ్గజాల్లో ఒకరైన గౌతమ్ అదాని హఠాత్తుగా జగన్మోహన్ రెడ్డితో భేటీ అయ్యారు. ఆదివారం అదానీ సోదరులు తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయానికి వచ్చారు. వీరి సమావేశం ముఖ్యమంత్రి షెడ్యూల్లో లేదు. అయినా అదానీ సోదరులు వచ్చి జగన్ తో భేటీ అవ్వటంతో అందరి దృష్టి ఇపుడు వీళ్ళ భేటీపైనే కేంద్రీకృమైంది. విశాఖపట్నం జిల్లాలోని గంగవరం పోర్టులో నూరుశాతం వాట కోసం అదానీ గ్రూపు ప్రయత్నిస్తున్న విషయం అందరికీ తెలిసిందే.
ఇప్పటికే 89 శాతం వాటాను సొంతం చేసుకున్న అదానీ గ్రూపు మిగిలిన 10.54 శాతం వాటాను కూడా కొనేస్తే ఏకమొత్తంగా పోర్టుకు ఓనర్ అయిపోతారు. దీనికోసం ప్రభుత్వంతో అదానీ ఒప్పందం కూడా చేసుకున్నారు. ఈ ఒప్పందం ఫలితంగా ప్రభుత్వం తన వాటాను గ్రూపుకు బదిలీ చేసేయటం, గ్రూపు ప్రభుత్వానికి సుమారు రు. 645 కోట్లు చెల్లించటం కూడా జరిగిపోయింది. అయితే వీళ్ళ ఒప్పందం జరగ్గానే ప్రకాశం జిల్లాకు చెందిన ఇద్దరు లాయర్లు ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని వేశారు.
ప్రభుత్వం తన వాటాను అమ్మేందుకు వీల్లేదంటు వీరు తమ పిటీషన్లో పేర్కొన్నారు. ఈ కేసును విచారించిన హైకోర్టు తదుపరి విచారణను ఈనెల 20వ తేదీకి వాయిదా వేసింది. అంటే సరిగ్గా వారం తర్వాత జరిగే విచారణ సందర్భంగానే జగన్ తో అదానీ సోదరులు సమావేశం అయ్యారనే ప్రచారమైతే పెరిగిపోతోంది. అదానీ గ్రూపుకు తన వాటాను అమ్ముకునే హక్కు ప్రభుత్వానికి ఉందా లేదా అనే విషయంలో కోర్టు విచారణలో తేలిపోతుంది.
ఒకవేళ తన వాటాను అమ్మే హక్కు ప్రభుత్వానికి లేదని కోర్టు తేలిస్తే అప్పుడేంటి పరిస్దితి ? అని చర్చించేందుకే అదానీ సోదరులు సీఎంతో భేటీ అయినట్లు సమాచారం. నిజానికి పోర్టులో ప్రభుత్వం వాటా ఉన్నది సుమారు 10 శాతం మాత్రమే. ఒకవేళ ప్రభుత్వం తన వాటాను అమ్మటం చెల్లదని కోర్టు తీర్పిచ్చినా అదానీ సోదరులు ఇంత కంగారు పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మేజర్ షేర్ హోల్డర్లు వీళ్ళే అయిన కారణంగా నిర్ణయాధికారం కూడా అదానీకే ఉంటుంది. వీళ్ళ నిర్ణయాన్ని ప్రభుత్వం ఎలాగూ కాదనే అవకాశాలు తక్కువే. మరి 20వ తేదీన విచారణలో ఏమి జరుగుతుందో చూడాల్సిందే.