అదానీ షేర్ల పతనం కొనసాగు...తూనే ఉంది.. ఈ రోజు అదే సీన్

Update: 2021-06-17 12:30 GMT
షేర్ మార్కెట్ లో తిరిగులేని షేర్లుగా.. పైకి వెళ్లటమే కానీ కిందకు దిగే పరిస్థితి లేనట్లుగా..ఒకవేళ అలా జరిగినప్పటికీ.. వెంటనే కరెక్షన్ కు అవకాశం ఉన్నట్లుగా వాదనలు వినిపించే అదానీ షేర్ల టైం ఏ మాత్రం బాగోలేదు. గడిచిన మూడు రోజులుగా అదానీ షేర్ల పతనం కొనసాగుతూనే ఉంది. విదేశీ మీడియా సంస్థలో వచ్చిన కథనం పెను సంచలనంగా మారటం.. అందులోని అంశాలతో దేశీయ మీడియా సంస్థ అచ్చేసిన కథనం అదానీ షేర్లపై కొత్త సందేహాలకు కారణమైంది. మార్కెట్ సెంటిమెంట్ ను దెబ్బ తీసింది.

దీంతో.. అమ్మకాల జోరు సాగటంతో అదానీ షేర్ల ధరలు ఢమాల్ అంటున్నాయి. అదానీ గ్రూపుకంపెనీల్లో పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టిన మూడు విదేశీ ఫోర్టుపోలియో ఇన్వెస్టర్ల అకౌంట్లను నేషనల్ సెక్యూరిటీస్ డిపాజటరీ లిమిటెడ్ ఫ్రీజ్ చేసిందన్న వార్తలు రావటంతో సోమవారం ఆ షేర్లు భారీగా నష్టపోయాయి. ఈ మూడు కంపెనీలు మారిషస్ కు చెందినవి కాగా.. ఈ మూడింటి అడ్రస్ లు ఒకటే కావటం విశేషం. అంతేకాదు ఈ మూడు ఫండ్ లు కూడా తమ 90 శాతం డబ్బుల్నిఅదానీ గ్రూప్ నకు చెందిన నాలుగు కంపెనీల్లో పెట్టుబడి పెట్టటం గమనార్హం.

అయితే.. ఈ వార్తల్లో నిజం లేదని అదానీ గ్రూప్ వివరణ ఇచ్చింది. ఇందులో నిజానిజాల మాట ఎలా ఉన్నా.. సోమవారం సెషన్ ఇంట్రాడేలో అదానీ ఎంటర్ ప్రైజెస్ షేరు ఏకంగా 25 శాతం క్రాష్ అయ్యింది. మిగిలిన షేర్లు దాదాపు5 శాతం మేర నష్టపోయాయి. ఈ నష్టాల పరంపర మంగళ.. బుధవారాల్లోనూ సాగింది. బుధవారం విషయానికి వస్తే అదానీ పోర్ట్స్ 7.17 శాతం.. అదానీ ఎంటర్ ప్రైజస్ 5.77 శాతం.. అదానీ పవర్ ట్రాన్స్ మిషన్ 5 శాతం.. అదానీ టోటల్ గ్యాస్ 5 శాతం.. అదానీ పవర్ 4.97 శాతం.. అదానీ గ్రీన్ ఎనర్జీ 3.10 శాతం మేర నష్టపోయాయి.

ఈ షేర్లలో అదానీ టోటల్.. అదానీ ట్రాన్స్ మిషన్.. అదానీ పవర్ షేర్లు లోయర్ సర్య్కూట్ బ్రేకర్ ను తాకాయి. ఇక.. ఈ రోజు విషయానికి వస్తే.. ట్రేడింగ్ మొదలైనప్పటికి నుంచి 1.5 శాతం నష్టపోయి నేల చూపులు చూస్తోంది.గురువారం ఉదయం పది గంటల సమయానికి అదానీ పోర్ట్స్ 2.39 శాతం.. అదానీ ఎంటర్ ప్రైజస్ 1.62 శాతం.. అదానీ పవర్ ట్రాన్స్ మిషన్ 5 శాతం.. అదానీ టోటల్ గ్యాస్ 5శాతం.. అదానీ పవర్ 4.99 శాతం.. అదానీ గ్రీన్ ఎనర్జీ 4.04 శాతం నష్టపోయాయి. నిన్నటితో పోలిస్తే.. ఈ రోజు రికవరీలోకి వెళుతుందా? నష్టపోవటం కంటిన్యూ అవుతుందా? అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
Tags:    

Similar News