అంబానీని దాటేయనున్న అదానీ.. కారణమిదే?

Update: 2021-03-14 02:30 GMT
భారత ప్రముఖ పారిశ్రామికవేత్త గౌతం అదానీ కొత్త రికార్డులు సృష్టిస్తున్నారు. 2021లో ప్రపంచంలోనే నంబర్ 1 కుబేరులైన అమెజాన్ బెజోస్, టెస్లా ఎలన్ మస్క్ లను మించి సంపాదించిన అదానీ తాజాగా దేశంలోనే నంబర్ 1గా నిలవడానికి వడివడిగా అడుగులు వేస్తున్నారట.. గత ఏడాదిగా ఆయన సంపాదన జెట్ స్పీడులా పెరిగిపోతోంది.అదానీ సంపాదన ఒక్క ఏడాదిలో ఏకంగా 34 బిలియన్ డాలర్లకు పైగా పెరిగింది. దేశంలోనే అపర కుబేరుడు ముకేష్ అంబానీ సంపాదన ఒక్క ఏడాదిలో కేవలం 8 బిలియన్ డాలర్లు మాత్రమే కావడం గమనార్హం.

గౌతం అదానీ ప్రధాన బిజినెస్ లు పోర్టులు, ఎయిర్ పోర్టులు, బొగ్గు గనులు, పవర్ ప్లాంట్లు కావడం విశేషం. ప్రజలకు నిత్యావసరాలు అందించే అమెజాన్ అధినేత ప్రపంచంలోనే నంబర్ 1 స్థానంలో ఉన్నారు. ప్రజల నిత్యావసరాలు అమ్మే వారే దూసుకుపోతున్న వేళ అదానీ ఈ టఫ్ ఇండస్ట్రీలతోనూ లాభాల పంట పండించడం విశేషం.

అదానీ సంపాదన పెరగడానికి ఆయన కంపెనీల షేర్లు ఏకంగా 50 నుంచి 500శాతం పెరగడమే కారణంగా తేలింది. అయితే ఆషేర్ల విలువ ఎలా పెరిగిందన్నది మాత్రం మార్కెట్ వర్గాలను సైతం ఆశ్చర్యపరుస్తోంది. ఏపీలోని కృష్ణంపట్నం పోర్టును సైతం ఇదే అదానీ కైవసం చేసుకున్నాడు. భావనపాడు కూడా ఆయనకే దక్కనుందట.. ఎన్నో ఎయిర్ పోర్టులను కేంద్రం నుంచి అదానీ లీజుకు తీసుకున్నాడట.. రైల్వే లైన్లు, రైల్వేల్లో కూడా అదానీ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ప్రభుత్వ రంగం నుంచి అనేకం ఆయన పరం అవుతున్నాయి. అందుకే ఆయన కంపెనీల షేర్లు పెరిగి ముఖేష్ అంబానీని తోసిరాజని ఈయన నంబర్ 1గా నిలవడం  ఖాయమంటున్నారు మార్కెట్ వర్గాలు.
Tags:    

Similar News