ఆన్లైన్ గేమ్స్..ఈ మధ్య కాలంలో చిన్నపిల్లలు , పెద్ద పిల్లలు అన్న తేడా లేకుండా అందరూ బాగా అడిక్ట్ అవుతున్నారు. ఎంతలా అంటే రాత్రి, పగలు అన్న తేడా ఉండదు , తిన్నామా లేదా అనే ఆలోచనే లేదు. కేవలం స్మార్ట్ ఫోన్స్ లో ఆన్ లైన్ గేమ్స్ లో మునిగితేలుతున్నారు. బంగారం లాంటి తమ భవిష్యత్తును, తమ కెరీర్లను నాశనం చేసుకుంటున్నారు. ఆ మోజులో పడి తమ జీవితాలను అంతం చేసుకుంటున్నారు. పేరెంట్స్ మందలిస్తే ప్రాణాలు తీసుకుంటున్నారు. ఇలాంటి ఘటన తాజాగా మధ్యప్రదేశ్ లో జరిగింది.
మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని చాత్తర్ పూర్ జిల్లాలో 13 ఏళ్ళ కుర్రాడు ఆన్ లైన్ గేమ్ లో 40 వేల రూపాయలు నష్టపోయి డిప్రెషన్ లో పడిపోయాడు. సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆరో తరగతి చదువుతున్న ఈ బాలుడు ఓ ల్యాబ్ యజమాని కొడుకని తెలిసింది. ఎంతసేపూ ఫోన్ పట్టుకుని ఈ గేమ్ ఆడుతున్నావని, చదువుకోవాలని ఇతని తల్లి మందలించినట్టు తెలుస్తోంది. తల్లి మందలింపుతో బాటు తాను 40 వేలు నష్టపోవడంతో ఆ మానసిక వేదన భరించలేక ఈ బాలుడు బలవన్మరణానికి పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు.
తన తల్లికి చెందిన యూపీఐ అకౌంటు నుంచి ఈ కుర్రాడు ఈ డబ్బు విత్ డ్రా చేసి ఫ్రీ ఫైర్ గేమ్ అనే ఆన్ లైన్ ఆట ఆడి నష్టపోయాడు. తనను క్షమించాలని, ఈ గేమ్ లో ఈ డబ్బు లాస్ అయ్యాయని యితడు తన సూసైడ్ నోట్ లో రాశాడు. సుమారు రూ.40 వేలు కోల్పోయాక అతడి తల్లి ఫోన్‌లో డబ్బులు కట్ అయిన మెసేజ్ చూసి, కొడుకును తిట్టింది. ఓ వైపు డబ్బులు పోవడంతో అప్పటికే బాధలో ఉన్న ఆ పిల్లాడు తల్లి తిట్టడంతో మనస్తాపం చెందాడు. ఇంట్లో తల్లిదండ్రులు లేని సమయంలో సీలింగ్ ఫ్యాన్ కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే ఆ డబ్బు అతడే యాడ్ చేసి ఆడాడా లేక మరెవరి ఒత్తిడైనా ఉందా లేదంటే ఎవరైనా సైబర్ నేరగాళ్ల హస్తం ఉందా అనే అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు. ఇతని తల్లి ఆరోగ్య శాఖలో పని చేసేదని, తల్లీ తండ్రీ ఇద్దరూ ఇంట్లో లేని సమయంలో ఈ అఘాయిత్యానికి దిగాడని పోలీసులు తెలిపారు.