హోరాహోరీగా సాగినట్లు కనిపించిన సార్వత్రిక ఎన్నికల్లో బంపర్ మెజార్టీతో రెండోసారి విజయవంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన మోడీ సర్కారు.. తాజాగా తన వార్షిక బడ్జెట్ ను సభకు సమర్పించింది. ఈ సందర్భంగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆసక్తికర అంశాల్ని తెర మీదకు తెచ్చారు. కేంద్ర బడ్జెట్ ను ఎంతో ఆసక్తిగా ఎదురుచూసే మధ్యతరగతి వారికి ఊరటనిస్తూ ఒక శుభవార్తను చెప్పారు.
మధ్యతరగతి ప్రజలు తమ సొంతింటి కలను తీర్చుకునే విషయంలో బంపర్ ఆఫర్ ఇచ్చారు. తాజాగా ఆమె చేసిన ప్రకటన ప్రకారం మొదటిసారి ఇంటిని కొనుగోలు చేసే వారికి భారీ ప్రోత్సాహాన్ని ప్రకటించారు. రూ.45 లక్షల లోపు గృహరుణాలపై వడ్డీ రాయితీని పెంచారు. ప్రస్తుతం గృహరుణాలపై రూ.2లక్షల వరకు వడ్డీ రాయితీ ఉండగా.. దాన్ని రూ.3.50 లక్షలకు పెంచుతున్నట్లు ప్రకటించారు.
కొత్తిల్లు కొనేవారికి తాజా ఆఫర్ ఆర్థికంగా చక్కటి వెసులుబాటుగా మారుతుందని చెప్పకతప్పదు. ఇక.. ఆదాయపన్ను రాయితీ మీద కూడా క్లారిటీ ఇచ్చేశారు. వ్యక్తిగత ఆదాయపు పన్ను పరిమితిలో ఎలాంటి మార్పులు లేవన్నారు. గత బడ్జెట్ సందర్భంగా వార్షికంగా రూ.5లక్షల ఆదాయం వరకూ ఎలాంటి ఆదాయ పన్ను లేదని.. పాత విధానమే అమలు చేస్తున్నట్లు ప్రకటించారు.