అవి చూసేవాళ్లలో ఆడవాళ్లే ఎక్కువ.. అవి ఏంటంటే ?

Update: 2019-12-20 06:12 GMT
ప్రస్తుత ఈ సమాజంలో ఆడవారి పై రోజురోజుకి అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయి. వీటిపై ప్రభుత్వాలు కానీ , పోలీసులు కానీ ఎన్ని చర్యలు చేపడుతున్న తగ్గడంలేదు. దీనికి ఒక కారణం పోర్న్ వీడియోలు అని కూడా చెప్పవచ్చు. ఈ పోర్న్ వీడియోలు ఆన్ లైన్ లో చాలా విరివిగా దొరుకుతుండటంతో ఈ వీడియో లకి అందరూ బాగా అడిక్ట్ అయిపోతున్నారు. ముఖ్యంగా చిన్నపిల్లలు కూడా ఈ వీడియోలని చూస్తున్నారు. అశ్లీల వీడియోలను అదే పనిగా వీక్షించే వారిలో ఎక్కువ శాతం  మహిళలు కూడా ఉన్నట్టుగా వెలువడ్డ సమాచారం సర్వత్రా ఆశ్చర్యానికి గురిచేస్తుంది. చెన్నైలో 30 మందిని గుర్తించి ఉన్నట్టు ఏకంగా ఏడీజీపీ రవి ప్రకటించారు. 

పోర్న్‌ వీడియోలను వీక్షించే వారి సంఖ్య భారత్‌ లో అత్యధికంగా ఉన్నట్టు ఓ సర్వేలో వెల్లడైన విషయం తెలిసిందే. దీనితో  మహిళలకు - పిల్లలకు భద్రత కల్పించే రీతిలో దూకుడు పెంచి ఉన్న పోలీసుల యంత్రాంగం అశ్లీల వీడియోలను అదే పనిగా గంటల కొద్ది వీక్షించే వారి భరతం పట్టే రీతిలో చర్యలు చేపట్టారు. చిన్న పిల్లల్ని - మైనర్లను అశ్లీలంగా చిత్రీకరించి తీసే వారిని మాత్రమే కాదు , అశ్లీల సైట్స్‌ ల్లో గంటల కొద్ది గడిపే వారిని గురి పెట్టి భరతం పట్టే విధంగా పోలీసులు దూకుడు పెంచే పనిలో పడ్డారు. తమిళనాడులో మూడు వేల మంది అదే పనిగా పోర్న్‌ వీడియోల్ని చూస్తూ - గంటల కొద్ది ఆన్‌ లైన్‌ లో గడుపుతున్నట్టుగా  ఒక సర్వేలో తేలింది. ఇందులో మహిళలు కూడా ఉన్నట్టు సమాచారం. అలాంటి మహిళలు చెన్నైలోనే ఎక్కువమంది ఉన్నారు అని తెలుస్తోంది. ఈ విషయాన్ని స్వయంగా ఏడీజీపీ రవి తెలియజేసారు.

కోడంబాక్కంలోని ఓ మహిళా కళాశాలలో గురువారం పోలీస్‌ యాప్‌ అవగాహన కార్యక్రమం జరిగింది. ఇందులో ఏడీజీపీ రవి మాట్లాడుతూ - మహిళలు - పిల్లల మీద దాడుల్ని అరి కట్టడం లక్ష్యంగా తాము చర్యల్ని వేగవంతం చేశామన్నారు. 7.30 కోట్ల మంది జనాభా కల్గిన ఈ తమిళనాడులో ఇప్పటి వరకు పోలీసు యాప్‌ ను పది లక్షల మంది మాత్రమే డౌన్‌ లోడ్‌ చేసుకుని ఉన్నారని - వీరిలోనూ కేవలం నాలుగు లక్షల మంది మాత్రమే రిజిస్ట్రేషన్‌ చేసుకున్నట్టు తెలిపారు. మిగిలిన వారు ఎందుకు ఈ యాప్‌ మీద దృష్టి పెట్టడం లేదని విచారం వ్యక్తం చేశారు. మహిళలు - పిల్లలకు భద్రత కల్పించే విధంగా రూపకల్పన చేసిన ఈ యాప్‌ లో స్వల్ప మార్పులు చేయనున్నట్టు చెప్పారు. ఇటీవల కాలంగా అశ్లీల చిత్రాల్ని వీక్షించే వారి సంఖ్య పెరగడం విచారకరం అని - అందులో   మహిళలు కూడా ఉండడం కొంత బాధకరం అని తెలిపాడు.  ఇకపై దయ చేసి అశ్లీల వీడియోలను వీక్షించ వద్దు అని పిలుపు నిచ్చారు.


Tags:    

Similar News