దేశ వ్యాప్తంగా ఈ మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో విద్యార్థుల ఆరోగ్య దృష్ట్యా ఏపీలో టెన్త్ పరీక్షలు వాయిదా వేసిన సంగతి తెలిసిందే. ఏపీతో పాటుగా పలు రాష్ట్రాల ప్రభుత్వాలు టెన్త్ పరీక్షలను వాయిదా వేసాయి. మార్చి 24 నుండి ఈ మహమ్మారి కారణంగా దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో ...టెన్త్ పరీక్షలను ఎప్పటికప్పుడు వాయిదా వేస్తూ వస్తున్నారు. అయితే , 1 నుండి 9 వ తరగతి వరకు చదివే విద్యార్థులని పరీక్షలు లేకుండా పై తరగతులకు ప్రమోట్ చేస్తున్నట్టు ప్రకటించారు.
ప్రస్తుతం దేశవ్యాప్తంగా మూడోదశ లాక్ డౌన్ కొనసాగుతుంది. ఈ లాక్ డౌన్ మే 17 వరకు కొనసాగబోతుంది. అయితే , దేశంలో ఈ మహమ్మారి విజృంభణ తగ్గకపోవడంతో మరోసారి లాక్ డౌన్ ను పొడగించినా కూడా పెద్దగా ఆశ్చర్యపోవాల్సిన అవసరంలేదు. ఈ తరుణంలో ఏపీ విద్యాశాఖ మంత్రి ..టెన్త్ పరీక్షలపై కీలక వ్యాఖ్యలు చేసారు.
ఏపీలో పదో తరగతి పరీక్షల నిర్వహణపై మంత్రి ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ ... రాష్ట్రంలో జూలైలో పదో తరగతి పరీక్షలు నిర్వహిస్తామని, త్వరలోనే పరీక్షలకి సంబంధించిన షెడ్యూల్ విడుదల చేస్తామని.. విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా ఈ పరీక్షలను నిర్వహిస్తామని ఆయన వెల్లడించారు. భౌతిక దూరం పాటిస్తూ.. మాస్కులు ధరించి విద్యార్థులు పరీక్షలు రాసేలా ఏర్పాట్లు చేస్తామని సురేష్ వివరించారు. అలాగే ఒక్కో క్లాస్ రూమ్ లో 12 మంది విద్యార్థులతో పరీక్షలు రాయించనున్నామని మంత్రి తెలిపారు. దీనితో విద్యార్థులు పరీక్షలకి సిద్ధంగా ఉండాలని మంత్రి తెలిపారు.