వైసీపీ నుంచి గెలిచి టీడీపీలోకి వచ్చిన ఎమ్మెల్యేల్లో కొందరికి మొదట మంత్రి పదవులిచ్చి సత్కరించిన బాబు ఇప్పుడు రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో వారిని నట్టేట ముంచడానికి రెడీ అయ్యారని తెలుస్తోంది. కడప జిల్లాలో వైసీపీ నుంచి గెలిచిన ఆదినారాయణ రెడ్డి ఫిరాయించి టీడీపీలో చేరిన సంగతి తెలిసిందే. సీనియర్ నేత కావడంతో చంద్రబాబు పిలిచీ మరి మంత్రి పదవి ఇచ్చాడు. కానీ వచ్చే ఎన్నికల్లో మాత్రం ఆయనకు మొండి చేయి చూపించబోతున్నారని తెలిసింది.
జమ్మలమడుగు నియోజకవర్గం నుంచి గడిచిన 2014 ఎన్నికల్లో వైసీపీ నుంచి ఆదినారాయణ రెడ్డి పోటీచేయగా.. ఆయనకు పోటీగా టీడీపీ నుంచి బలమైన రామసుబ్బారెడ్డి బరిలో నిలిచారు. వీరిద్దరికి దశాబ్ధాల వైరం ఉంది. ఫాక్ష్యన్ గొడవలు జరిగాయి. కానీ ఆదినారాయణ రెడ్డి గెలవగానే బాబు ఆహ్వానించి మంత్రి పదవి ఇచ్చారు. ఆ తర్వాత ఇద్దరూ రాజీ అయ్యి కాంట్రాక్టులు, పనుల్లో చెరిసగం పంచుకున్నారని గుసగుసలు వినిపించాయి. ఈ విషయాన్ని ఆదినారాయణ రెడ్డి కూడా స్వయంగా పలు చోట్ల బహిరంగంగా చెప్పారు.
కానీ ఇప్పుడు రాబోయే ఎన్నికల దృష్ట్యా కడపలో టీడీపీ పరిస్థితి మరీ దిగజారిందట.. జమ్మలమడుగులో ఆదినారాయణ రెడ్డి గెలవడం కష్టమేనని తేలింది. అందుకే ఆయన్ను కూరలో కరివేపాకులా వాడుకొని వదిలించుకుంటున్నారు. జమ్మలమడుగు టికెట్ ను తాజాగా రామసుబ్బారెడ్డికే ఇవ్వడానికి బాబు నిర్ణయించాడట.. అదే సమయంలో మంత్రి ఆదినారాయణ రెడ్డికి కడప ఎంపీ సీటును ఇస్తున్నట్టు తెలిపారట.. జమ్మలమడగు విషయంలో బాబు రామసుబ్బారెడ్డి వైపు తిరగడాన్ని ఆదినారాయణ రెడ్డి జీర్ణించుకోలేకపోతున్నారట..
కడప ఎంపీ సీటు వైసీపీకి కంచుకోట లాంటిది. అక్కడ వైఎస్ హయాం నుంచి గెలుస్తూనే వస్తోంది. 2014 లో కూడా వైసీపీనే గెలిచింది. ఇలా ఓడిపోయే సీటును తనకు బాబు ఇవ్వడంపై మంత్రి ఆదినారాయణ రెడ్డి రగిలిపోతున్నట్టు తెలిసింది. మరి ఆయన నెక్ట్స్ ఏం చేస్తాడన్నది హాట్ టాపిక్ గా మారింది.
Full View