విపక్ష నేత జగన్ సొంత జిల్లాకు చెందిన జమ్మలముడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి వైసీపీ నుంచి టీడీపీలో చేరిన విషయం తెలిసిందే. దీంతో వైసీపీ ఈ విషయంలో ఆదినారాయణరెడ్డిపై విమర్శలు కురిపిస్తోంది. దమ్ముంటే ఆయన రాజీనామా చేసి గెలవాలని పదేపదే డిమాండ్ చేస్తున్నారు. దీంతో చిర్రెత్తుకొచ్చిన ఆదినారాయణ... తాను రాజీనామాకు సిద్ధమేనని.... తన వ్యక్తిత్వం ముందు ఎమ్మెల్యే పదవి చాలా చిన్నదని చెప్పారు. పదవి గొప్పదనం నిలబడాలని తాను కూడా కోరుకుంటానన్నారు. అయితే రాజీనామా ఎందుకు చేయలేదన్నది చెబుతూ ఆయన చంద్రబాబును ఇరికించారు.
పార్టీ మారినప్పుడే రాజీనామా చేస్తానని తాను చెప్పానని అయితే చంద్రబాబు ఆ విషయం తరువాత మాట్లాడుదాం లే అన్నారని ఆదినారాయణ చెబుతున్నారు. చంద్రబాబు ఓకే అంటే అరగంటలో రాజీనామా చేస్తానన్నారు. దీంతో ఫిరాయింపులను ప్రోత్సహించడమే కాకుండా అనైతికంగా కొనసాగించడానికి కూడా చంద్రబాబే కారణమన్న భావన కలుగుతోంది. మొత్తానికి వైసీపీ నేతలు ఒకరిద్దరితోనే ఇంత రచ్చ మొదలైతే... టీడీపీ చెబుతున్నట్లుగా ఇంకా ఎక్కువ మంది చేరితే టీడీపీ పరిస్థితి ఎలా ఉంటుందో చూడాలి.