ఆదినారాయణరెడ్డి చేరిక ఈ రోజేనా?

Update: 2016-02-22 09:02 GMT
వైసీపీ అధినేత జగన్ కు సోమవారం షాక్ తగిలే సూచనలు కనిపిస్తున్నాయి. ఆ పార్టీ కీలక నేత, జగన్ సొంత జిల్లాకు చెందని జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి టీడీపీలో చేరడానికి చాలాకాలంగా సంప్రదింపులు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆయన చేరికకు దాదాపు అంతా సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఆయన్ను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న టీడీపీ నేత రామసుబ్బారెడ్డిని చంద్రబాబు బుజ్జగించారని... ఆయన సమక్షంలోనే ఆదినారాయణరెడ్డిని చేర్చుకుంటారని తెలుస్తోంది.
   
టీడీపీ నుంచి వచ్చిన పిలుపు మేరకు ఆదినారాయణరెడ్డి తన అనుచరులతో కలిసి ఆదివారం రాత్రే కడప నుంచి బయలు దేరి ఉదయాన్నే విజయవాడ చేరుకున్నారు.  ఈ రోజు సాయంత్రం చంద్రబాబుతో ఆయన భేటీ అవుతారు. మరోవైపు రామసుబ్బారెడ్డికి కూడా చంద్రబాబు నుంచి పిలుపు రావడంతో ఆయనా సోమవారం ఉదయం బయలుదేరారు. దీంతో సాయంత్రం రామసుబ్బారెడ్డి సమక్షంలోనే ఆదినారాయణరెడ్డి చంద్రబాబుతో భేటీ అవుతారని.... అది ముగియగానే తాను టీడీపీలో చేరుతున్నట్లు ఆయన ప్రకటిస్తారని తెలుస్తోంది. ఆదినారాయణ చేరిక తరువాత కడపలో పార్టీలో ఎలాంటి గొడవలు ఉండరాదన్న ఉద్దేశంతోనే చంద్రబాబు రామసుబ్బారెడ్డిని కూడా ఈ భేటీకి పిలిచారు.
   
మరోవైపు కర్నూలులో భూమా నాగిరెడ్డి వర్గాన్ని వ్యతిరేకిస్తున్న శిల్పా మోహనరెడ్డి సోదరులకూ చంద్రబాబు నుంచి పిలుపు వచ్చింది. వారు కూడా విజయవాడ చేరుకున్నారు. భూమా నాగిరెడ్డి కూడా ఈ రోజు సాయంత్రం చంద్రబాబును కలిసే అవకాశాలున్నాయి. మొత్తానికి రాయలసీమ జిల్లాల కీలక నేతలంతా విజయవాడలో తిష్ఠ వేయడం రాజకీయంగా ఆసక్తికరంగా మారింది.
Tags:    

Similar News