ముద్ర‌గ‌డ‌కు మ‌హేష్ బాబాయి ఫుల్ స‌ఫోర్ట్‌...

Update: 2017-08-25 16:16 GMT
ప్రముఖ సినీ నిర్మాత - హీరో కృష్ణ సోదరుడు - ప్రిన్స్ మ‌హేష్ బాబాయి ఘట్టమనేని ఆదిశేషగిరిరావు కాపు ఉద్యమానికి మద్దతు ప్రకటించారు. కిర్లంపూడి వెళ్లి మ‌రీ ఆయన ఉద్యమనేత ముద్రగడను కలిసి తన సంఘీభావాన్ని ప్రకటించారు. ఈ సందర్భంగా ముద్రగడతో తనకున్న‌ అనుంబధాన్ని ఆదిశేషగిరిరావు వివరించారు. ముద్రగడ మద్రాసు వచ్చినపుడు మేము చాలా సన్నిహితంగా ఉండేవారము అని అన్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు ఇచ్చిన హామీని అమలు చేయకుండా ముద్రగడ పాదయాత్ర ని అడ్డుకోవడం అప్రజాస్వామికము అని మండిప‌డ్డారు స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఏ ప్రభుత్వం ఇలా వ్యవహరించలేదని మండిప‌డ్డారు.

కాపుల‌కు రిజ‌ర్వేష‌న్ కోరుతూ ముద్రగడ చేసే డిమాండ్‌ లో న్యాయం ఉందని పేర్కొంటూ తమ పూర్తి సంఘీభావం తెలియజేస్తున్నామ‌ని ఆదిశేష‌గిరిరావు అన్నారు. కాపుల న్యాయమైన డిమాండ్ల‌ను వెంటనే ప్రభుత్వం ప‌రిష్క‌రించాల‌ని డిమాండ్‌ చేశారు. నంద్యాలలో ఉప ఎన్నిక‌లో - కాకినాడ కార్పొరేష‌న్ ఎన్నిక‌లో వైఎస్‌ ఆర్‌ పార్టీ  ఘన విజయం సాధిస్తుందని ఆదిశేష‌గిరి రావు అన్నారు. రాష్ట్రంలో వైఎస్‌ ఆర్‌ పార్టీకి ప్ర‌జాద‌ర‌ణ పెరుగుతోంద‌ని ఆయ‌న ధీమా వ్య‌క్తం చేశారు.

మ‌రోవైపు అధికార - ప్ర‌తిపక్షాలు ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్న కాకినాడ నగర పాలక సంస్థ ఎన్నికలు ప్ర‌శాంతంగా నిర్వ‌హించేందుకు పోలీసులు అన్ని జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నారు. ఎన్నికల ఏర్పాట్లపై పోలీసు అధికారుల‌తో స‌మీక్షించిన అనంత‌రం జిల్లా ఎస్పీ విశాల్‌గున్నీ మీడియాతో మాట్లాడుత‌. కార్పొరేష‌న్ ఎన్నిక‌లు వాడి వేడిగా జరుగుతున్న వేళ డివిజన్ల వారిగా స్పెషల్‌ స్ట్రైకింగ్‌ ఫోర్స్‌ను ఏర్పాటు చేసి ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేలా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందని తెలిపారు. కాకినాడ నగరంలో 12 పోలీస్‌ పికెట్లను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. 200మంది నేరగాళ్లను గుర్తించి కౌన్సిలింగ్‌ ఇవ్వడం జరిగిందన్నారు. సిటీకి వచ్చి పోయే మార్గాలలో ప్రత్యేక నిఘాను ఉంచడం జరిగిందన్నారు. అలాగే డివిజన్‌ కు ఒక్క స్పెషల్‌ స్ట్రైకింగ్‌ ఫోర్స్‌ టీంను ఏర్పాటు చేయడం జరిగిందని, వారిలో ఒక ఎస్సై - 6గురు కానిస్టేబుల్స్‌ ఉంటారన్నారు. వారి ద్వారా డివిజన్‌ లో ఎటువంటి అవాంచనీయ సంఘటనలు జరిగినా చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఎస్పీ వివ‌రించారు. అయిన‌ప్ప‌టికీ ప‌రిస్థితి  అదుపుకాని పక్షంలో ఉన్నతాధికారులకు సమాచారాన్ని అందించి పోలీసు బలగాలను మోహరించడం జరుగుతుందన్నారు. సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించామ‌ని, అక్క‌డ మ‌రింత భ‌ద్ర‌త ఏర్పాటు చేస్తామ‌ని ఎస్పీ వివ‌రించారు.
Tags:    

Similar News