కలిసి రావాలే కానీ 29 ఏళ్లకే సీఎం కావొచ్చు

Update: 2019-10-25 04:39 GMT
ఏమైనా జరిగేందుకు రాజకీయాల్లో ఉండే అవకాశం మరే రంగంలోనూ ఉండదు. అప్పటిలా రాజులా వెలిగిపోయిన వ్యక్తిని అనామకుడిగా మార్చేసే రాజకీయం.. అదే సమయంలో తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల్లో పాల్గొని.. ఎమ్మెల్యేగా మంచి మెజార్టీతో గెలిస్తే చాలనుకున్న కుర్రాడ్ని ఏకంగా సీఎం అయ్యే ఛాన్స్ రావటం రాజకీయాల్లో మాత్రమే సాధ్యమవుతుందేమో?

తాజాగా రెండు రాష్ట్రాలకు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి షాకులు తగిలాయి. పేరుకు గెలుపు తమ ఖాతాలో పడినా.. మహారాష్ట్రలో ఆ పార్టీ పరిస్థితి మహా ఇబ్బందికరంగా మారింది. చూస్తూ.. చూస్తూ పవర్ నుతమ మిత్రుడి చేతికి ఇవ్వాల్సి రావటంపై వారు కిందామీదా పడుతున్నారు. హర్యానాలో ప్రజలు ఇచ్చిన తీర్పు కమలనాథుల నోళ్లను తెరవనీయకుండా చేసింది. ఇదంతా ఒక ఎత్తు అయితే.. మహారాష్ట్రకు కాబోయే ముఖ్యమంత్రి 29 ఏళ్ల కుర్రాడా? అంటే అవుననే మాట బలంగా వినిపిస్తోంది.

గత ఎన్నికలతో పోలిస్తే దాదాపు ఇరవై సీట్లు తగ్గిపోవటం.. శివసేన తన సీట్ల సంఖ్యను పెంచుకోవటంతో పాటు.. సేన అండ లేనిదే ప్రభుత్వాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఏర్పాటు చేయటం సాధ్యం కానివేళ.. ఆ పార్టీకి ముఖ్యమంత్రి పదవిని ఇవ్వకతప్పని పరిస్థితి నెలకొంది. దీంతో.. ఇప్పటివరకూ సీఎంగా వ్యవహరించిన ఫడ్నవీస్ తన చేతిలోని అధికారాన్ని శివసేనకు చెందిన ఆదిత్య ఠాక్రేను వరిస్తుందన్న మాట బలంగా వినిపిస్తోంది.

ఎన్నికలకు ముందే సీట్ల పంపిణీ సమయంలోనే 50-50 ఫార్ములాతో ఒప్పందం జరిగినట్లుగా సేన చెబుతోంది. అనుకున్న దాని ప్రకారం ఒప్పందాన్ని అమలు చేయాలని శివసేన కోరుతోంది. ఇందులో భాగంగా తొలి రెండున్నరేళ్ల పాలనను తమ చేతికి ఇవ్వాలని.. మలి రెండున్నరేళ్లను బీజేపీకి అప్పజెప్పేందుకు తమకు ఎలాంటి అభ్యంతరం లేదని అంటోంది. దీనిపై బీజేపీ కిందామీదా పడుతోంది. తమ నిర్ణయాన్ని మాత్రం ఇంకా వెల్లడించలేదు.

ఇదిలా ఉంటే.. మహారాష్ట్రకు కాబోయే ముఖ్యమంత్రిగా భావిస్తున్న అదిత్య ఠాక్రే విషయానికి వస్తే.. ఠాక్రే కుటుంబానికి చెందిన వారు ఇప్పటివరకూ ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసింది లేదు. అందుకు భిన్నంగా తొలిసారి అదిత్య ఎన్నికల బరిలోకి దిగారు. వర్లీ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసిన ఆయన 70వేల ఓట్లకు పైనే మెజార్టీతో గెలుపొందారు. తొలిసారి ఎమ్మెల్యేగా గెలవాలనుకున్న అదిత్యకు29 ఏళ్లకే మహారాష్ట్ర ముఖ్యమంత్రి కుర్చీలో అవకాశం లభిస్తే మాత్రం హిస్టరీ క్రియేట్ చేసినట్లే
Tags:    

Similar News