సన్యాసి ఎంపీలకు మగతనం నిరూపించుకోమంటున్న ఆజంఖాన్

Update: 2016-05-04 12:17 GMT
హిందూ జనాభాను పెంచేందుకు ప్రతి హిందువు కనీసం నలుగురు పిల్లలను కనాలన్న బీజేపీ ఎంపీలు యోగి ఆదిత్యానాధ్ - సాక్షిమహారాజ్ లపై సమాజ్ వాదీ పార్టీ నేత - ఉత్తరప్రదేశ్ మంత్రి అజాంఖాన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ముస్లింల జనాభా పెరుగుతోంది, హిందువుల జనాభా కూడా పెరగాల్సిన అవసరం ఉంది, ప్రతి హిందూమాత నలుగురు బిడ్డలకు జన్మనిచ్చి, ఇద్దరిని దేవాలయానికి అంకితం ఇవ్వాలంటూ గతంలో ఆదిత్యానాధ్ - సాక్షి మహారాజ్ లు వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఆ వ్యాఖ్యల నేపథ్యంలో ఆజంఖాన్ తాజాగా చేసి కామెంట్లు విమర్శలకు దారితీస్తున్నాయి.  ఆ ఇద్దరు బీజేపీ ఎంపీలు సన్యాసులని.. ముందు వారు పెళ్లి చేసుకుని తరువాత దేశ ప్రజలకు పిల్లలను కనాలన్న సూచన చేయాలని ఆజంఖాన్ అన్నారు. అంతేకాదు.. పెళ్లి చేసుకుని వారిద్దరూ మగతనం నిరూపించుకోవాలని సవాల్ కూడా విసిరారు.

ఇతరులపై విమర్శలు, ఇతరులకు సూచనలు మాని ఆయన మగాడిగా నిరూపించుకోవాలని ఆజంఖాన్ సవాలు విసిరారు. అలా నిరూపించుకుంటే వారి వంశం పెరుగుతుందని అన్నారు. ఇందుకుకోసం ముందుగా వివాహం చేసుకోవాలని సూచించారు. గతంలో తలాక్ పై వ్యాఖ్యానించిన సాక్షి మహారాజ్ పై విమర్శలు గుప్పిస్తూ, ఒక యువతిని రేప్ చేసిన వ్యక్తా విమర్శలు చేసేది? అని మండిపడ్డారు. రేప్ కేసు ఆరోపణలు ఎదుర్కొంటున్న సాక్షి మహారాజ్ పై ఏం మాట్లాడుతానని ఆయన అన్నారు.

మొత్తానికి ఇద్దరు వివాదాస్పద ఎంపీలకు మరో వివాదాస్పద నేత ఈస్థాయిలో కౌంటర్ ఇవ్వడంతో ఇక మాటల యుద్ధం మొదలవుతుందని అనుకుంటున్నారు.
Tags:    

Similar News