భారత్ మాతాకీ జై అంటేనే ఆ స్కూల్లో అడ్మిషన్

Update: 2016-04-04 10:20 GMT
'భారత్ మాతాకీ జై' అన్న నినాదంపై ఏర్పడిన వివాదానికి తెరపడడం లేదు. దీనిపై రోజుకో రకమైన వివాదమేర్పడుతోంది. రాజ్యాంగంలో లేదు కాబట్టి తాను అలా అనబోనంటూ గొడవ ప్రారంభించిన ఎంఐఎం అధినేత అసదుద్దీన్ పై చాలామంది నేతలు, ప్రముఖులు విరుచుకుపడ్డారు. తాజాగా బాబా రాందేవ్ కూడా దీనిపై ఘాటుగా స్పందించారు. ఈ రాజకీయ కామెంట్లన్నీ ఎలా ఉన్నా కానీ, తాజాగా గుజరాత్ లోని ఓ పాఠశాల తీసుకున్న నిర్ణయం చర్చనీయంగా మారింది.

గుజరాత్ లోని అమ్రేలీలో శ్రీ పటేల్ ఆశ్రమ ట్రస్టు ఆధ్వర్యంలో పాఠశాలలు ఉన్నాయి. ఆ ట్రస్టు తాజాగా ఓ నిర్ణయం తీసుకుంది. ట్రస్టు ఆధ్వర్యంలోని విద్యాసంస్థల్లో ప్రవేశాలు కావాలంటే అప్లికేషన్ పైన 'భారత్ మాతాకీ జై" అని రాయాలి. అలా రాయని అప్లికేషన్లను పక్కన పడేస్తారు.

గుజరాత్ కు చెందిన బీజేపీ నేత దిలీప్ సంఘానీ నిర్వహిస్తున్న ఈ ట్రస్తు ఆధ్వర్యంలో రెండు ప్రైమరీ స్కూళ్లు, రెండు హై స్కూళ్లు, ఒక కాలేజి ఉన్నాయి. మొత్తం 4500 మంది ఇక్కడ చదువుతున్నారు. 104 ఏళ్ల చరిత్ర ఉన్న తమ ట్రస్తు విద్యార్థుల్లో జాతీయ భావం పెంపొందించే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసకుందని ఆయన చెబుతున్నారు.కాగా కొన్నాళ్లుగా బీజేపీలో ఇబ్బందులు పడుతూ సైడ్ లైన్లో ఉన్న సంఘానీ మళ్లీ పొలిటికల్ గా షైనవ్వాలనే ఉద్దేశంతోనే అధిష్ఠానానికి నచ్చేలా ఈ ఎత్తుగడ వేశారని వినిపిస్తోంది.
Tags:    

Similar News