భార‌త్ సైన్యానికి థ్యాంక్స్ చెప్పాలంటున్నాడు!

Update: 2016-10-04 11:51 GMT
ఉరీ సెక్టార్‌పై ఉగ్ర‌వాదుల దాడులు - అనంత‌రం భార‌త సైన్యం నిర్వ‌హించిన స‌ర్జిక‌ల్ దాడుల నేప‌థ్యంలో ప‌లువురు సెలిబ్రిటీలు స్పందిస్తూనే ఉన్నారు. ముఖ్యంగా బాలీవుడ్ కు చెందిన కొంత‌మంది ప్ర‌ముఖుల ప్ర‌క‌ట‌న‌లు ఎంత చ‌ర్చ‌కు దారి తీస్తున్నాయో తెలిసిందే. ఈ సంద‌ర్భంగా స్వ‌త‌హాగా పాకిస్థాన్ కు చెందిన వాడైనా స‌రే.. ఈ విష‌యంతో కాస్త హుందాగానే స్పందించాడు ప్ర‌ముఖ గాయ‌కుడు అద్నాన్ స‌మీ. ఈ పాకిస్థానీ గాయ‌కుడు భార‌త పౌర‌స‌త్వాన్ని తీసుకున్నాడు.  భార‌త సైన్యం దాడుల అనంత‌రం ప్ర‌ధాని మోడీ నిర్ణ‌యాన్ని మెచ్చుకున్నాడు.

జ‌ర్జిక‌ల్ దాడుల‌పై స‌మీ స్పందిస్తూ... ఈ దాడుల విష‌యంలో భార‌త సైన్యానికి పాకిస్థాన్ రుణ‌ప‌డి ఉంటుంద‌న్నాడు. ఈ రెండు దేశాలూ ఉమ్మ‌డి శ‌త్రువు అయిన ఉగ్ర‌వాదంపై క‌లిసి పోరాటం చేయాల‌ని స‌మీ అన్నాడు. తాము ఉగ్ర‌వాదుల వ‌ల్ల చాలా ఇబ్బందులు ప‌డుతున్నామ‌ని పాకిస్థాన్ ఎప్ప‌టి నుంచో చెబుతోంద‌న్నాడు. అయితే, పొరుగు దేశ‌మైన భార‌త్ ఉగ్ర‌వాదుల‌పై దాడి చేసి పాక్ కు సాయం చేస్తున్నా పాకిస్థాన్ అంగీక‌రించే ప‌రిస్థితిలో లేక‌పోవ‌డం ఆవేద‌న కలిగిస్తోంద‌న్నాడు. తాను చేసిన ట్వీట్ల‌ను ఎవ‌రికి న‌చ్చిన‌ట్టు వారు వ‌క్రీక‌రించుకుంటున్నారు అని స‌మీ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశాడు.

పాకిస్థాన్ కు వ్య‌తిరేకంగా తాను ఒక్క మాటైనా ఆడ‌లేద‌నీ అన్నాడు. కాబ‌ట్టి తాను ఎవ్వ‌రికీ భ‌య‌ప‌డాల్సిన అవ‌స‌రం లేద‌నీ,  పైనున్న భ‌గ‌వంతుడికి త‌ప్ప ఇంకెవ్వ‌రికీ భ‌య‌ప‌డ‌న‌ని స‌మీ అన్నాడు. ఒక‌వేళ మ‌ళ్లీ పాకిస్థాన్ కు వెళ్లాల్సి వ‌చ్చినా కూడా తాను నిర్భ‌యంగా వెళ‌తాన‌నీ, తాను భ‌య‌ప‌డే ప‌రిస్థితి అయితే లేద‌ని స‌మీ స్ప‌ష్టం చేశాడు.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News