పొట్టిపేరుతో మస్తు పాపులర్ అయిన నటుల్లో శత్రుఘ్న సిన్హా ఒకరు. బాలీవుడ్ లో ఒకప్పుడు ఒక వెలుగు వెలిగిన ఆయన.. కొంతకాలంగా రాజకీయాల్లో బిజీగా ఉండటం తెలిసిందే. క్రమశిక్షణకు మారుపేరుగా చెప్పే బీజేపీలో.. అధినాయకత్వంపై విమర్శలు చేసే ధైర్యం ఉన్న అతి కొద్దిమందిలో శత్రుఘ్న సిన్హా ఒకరు. మోడీషాల తీరు నచ్చని ఆయన.. పార్టీ తీరుపై పలుమార్లు విమర్శలు చేస్తూ వార్తల్లో కనిపించేవారు.
ఈ మధ్యనే కాంగ్రెస్ లో చేరిన ఆయన.. తాజాగా ఒక ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. తానిప్పుడు మంచిదారిలోనే వెళుతున్నట్లు చెప్పుకున్నారు. బీజేపీని వదిలి కాంగ్రెస్ లో చేరటాన్ని పూర్తిగా సమర్థించుకున్న ఆయన.. తాను బీజేపీ నుంచి బయటకు వచ్చేసినా పార్టీ కురువృద్ధుడు లాల్ కృష్ణ అద్వానీ ఆశీస్సులు తనకు ఉన్నట్లుగా చెప్పుకోవటం విశేషం.
20 ఏళ్లు తాను బీజేపీలో కొనసాగినట్లు చెప్పిన ఆయన.. తాను ఉత్తమమైన మార్గాన్నిఎన్నుకున్నట్లు చెప్పారు. తాను పార్టీ మారనున్న విషయాన్ని తెలుసుకున్న అద్వానీ కన్నీటి పర్యంతమయ్యారని.. అయితే తనను ఆయన పార్టీ మారొద్దని మాత్రం చెప్పలేదన్నారు.
పార్టీ మారుతున్నట్లు విషయాన్ని చెప్పిన వేళలో అద్వానీ నోటి నుంచి.. సరే.. మంచిది అన్న మాట మాత్రమే వచ్చిందని.. మరే మాటా ఆయన నోటి నుంచి రాలేదన్నారు. వాజ్ పేయ్ హయాంలో బీజేపీలో చేరిన శత్రుఘ్న సిన్హా.. మోడీ హయాంలో పార్టీ తీరును తీవ్రంగా తప్పు పట్టారు.
వాజ్ పేయ్ కాలంలో బీజేపీలో ప్రజాస్వామ్యం కనిపించేదని.. తర్వాత రాచరికం పెత్తనం చెలాయిస్తున్నట్లు ఆరోపించిన ఆయన.. పార్టీలో అనుభజ్ఞులను పట్టించుకోవటం మానేసినట్లు ఆరోపించారు. అద్వానీ లాంటి సీనియర్ నేతకు పార్టీ టికెట్ కేటాయించకపోవటంపై ఆయన సీరియస్ వ్యాఖ్య చేశారు. తాను అద్వానీ మాదిరి ఎవరికి తలవంచనని.. కూర్చోమంటే కూర్చోవటం.. నిల్చోమంటే నిల్చోవటం లాంటి పనులు తాను చేయలేనని చెప్పారు. పార్టీలో అద్వానీ పరిస్థిత ఎలా ఉందన్న విషయాన్ని చెప్పటంతో పాటు.. తాను పార్టీ మారతానని చెప్పినప్పుడు పెద్దాయన వద్దని వారించకపోవటం ద్వారా ఆయన ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారన్న విషయాన్ని షాట్ గన్ చెప్పకనే చెప్పేశారని చెప్పాలి.