అప్పు లాభం.. డిపాజిట్ నష్టం

Update: 2016-11-19 22:30 GMT
డీమోనిటైజేషన్... ఇప్పటికే ప్రత్యక్షంగా ప్రజలను అల్లాడిస్తున్న అంశం. నగదు లభ్యత లేకుండా చేసిన నిర్ణయం మరి రానురాను ఇది మంచి చేస్తుందా చెడు చేస్తుందా..?  ఏఏ రంగాలపై ఎలాంటి ప్రభావం చూపిస్తుంది..? మన ఆర్థిక వ్యవహారాలను - అవసరాలను - ఆధారాలను ఎలా ప్రభావితం చేస్తుందో చూద్దాం.

1) ఫిక్స్ డ్ డిపాజిట్లు: నెగటివ్ ఇంపాక్ట్

బ్యాంకులకు నగదు నిల్వలు వచ్చి చేరడంతో అధిక వడ్డీలు ఇచ్చి డిపాజిట్లు సేకరించాల్సిన అవసరం బ్యాంకులకు తప్పింది. దీంతో ఫిక్స్ డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లు గణనీయంగా తగ్గనున్నాయి.

ఇది ఇబ్బందకరమైన పరిస్థితి. ముఖ్యంగా సీనియర్ సిటిజన్లు చాలామంది ఫిక్సుడు డిపాజిట్లపై వచ్చే వడ్డీతోనే బతుకుతుంటారు. వడ్డీ రేటు ప్రకారం నెలకు ఆదాయం అంచనా వేసుకుని దాన్ని బట్టి ప్లాన్ చేసుకుంటారు. రిటైర్మెంటు డబ్బులనూ వడ్డీ లెక్కల మేరకే ఫిక్సుడు చేస్తారు. ఇప్పుడు అలాంటివారి లెక్కలు తప్పి ఇబ్బందులు పడతారు.

ఎస్బీఐ - ఐసీఐసీఐ వంటివి ఇప్పటికే వడ్డీ రేట్లు తగ్గించేశాయి. కొద్దినెలల్లో ఈ వడ్డీ రేట్లు 6 శాతానికి పడిపోయినా ఆశ్చర్యం లేదు.

2) రుణాలు: పాజిటివ్ ఇంపాక్ట్

బ్యాంకుల వద్ద నగదు భారీగా చేరడంతో వాటి లెండింగ్ కెపాసిటీ పెరుగుతుంది. దీంతో రుణాలివ్వడానికి ముందుకొస్తారు. రుణాల ప్రక్రియ ఇప్పటికంటే ఇంకా సరళతరం చేస్తారు. పెద్దమొత్తంలో రుణాలిస్తారు. గృహ - వ్యక్తిగత - వాహన రుణాలపై వడ్డీ రేట్లు తగ్గడం ఖాయం. ఇప్పటికే యాక్సిస్ బ్యాంకు కొంత తగ్గించింది. మిగతా బ్యాంకులు కూడా పోటాపోటీగా రుణాలపై వడ్డీ రేట్లు తగ్గిస్తాయి.

పర్సనల్ లోన్ వడ్డీ శాతం 9.. హోమ్ లోన్ 7.5కి తగ్గుతాయని అంచనా. లోను కావాలనుకున్నవారు కాస్త వెయిట్ చేయడం బెటర్.

3) రియల్ ఎస్టేట్: కొనేవారికి ప్లస్.. అమ్మేవారికి లాస్

రియల్ ఎస్టేట్ వ్యవహారాల్లో బ్లాక్ మనీయే ఎక్కువ. ఇప్పడు బ్లాక్ మనీ ఆగిపోవడంతో రియల్ మార్కెట్ బాగా ఎఫెక్టవుతోంది. అయితే... ఈ సమయంలో ఫ్లాట్లు - స్థలాలు కొనేవారు లాభపడతారు. విక్రయించేవారు అనుకున్నంత లాభాలు ఆర్జించలేరు. 25 నుంచి 30 శాతం కరెక్షన్ రావొచ్చని అంచనా.

4) మ్యూచువల్ ఫండ్సు: లాభదాయకం

ముఖ్యంగా డెబ్ట్ మ్యూచువల్ ఫండ్సుకు మంచి సమయం ఇది. నవంబరు 8న మోడీ నిర్ణయం వచ్చినప్పటి నుంచి పదేళ్ల ప్రభుత్వ బాండ్లు 38 బేసిక్ పాయింట్లు పుంజుకొన్నాయి.

5 స్టాక్ మార్కెట్: దెబ్బే..

క్యాష్ ఆధారిత క్రయవిక్రయాలు ఎక్కువగా ఉండే సెక్టార్లన్నీ దెబ్బతినేశాయి. ఆ ప్రభావంతో షేర్ మార్కెట్ చప్పున పడిపోయింది. ఇది ఇంకా కొన్నాళ్లు కొనసాగడం ఖాయం. మార్కెట్ స్థిరపడేవరకు ప్రయోగాలు చేయకపోవడమే మంచిది. రిస్కును భరించి పడిన స్టాకులు కొంటే అవి మళ్లీ పుంజుకుని లాభాలు అందించినా అందించొచ్చు.

6) చిన్నమొత్తాలు, ఇతర పొదుపు పథకాలు: వడ్డీలు తగ్గుతాయి

నెలవారీ రాబడి ఇచ్చే చిన్నమొత్తాల పొదుపు పథకాలపై ఇప్పుడు 7.8 శాతం వరకు వడ్డీ ఉంది. సుకన్య సమృద్ధి యోజనపై 8.6 శాతం.. కిసాన్ వికాస్ పత్రాలపై 7.8.. ఎన్నెస్సీ బాండ్లపై 8.1 శాతం వడ్డీ ఉంది. పీపీఎఫ్ పైనా 8.1 వడ్డీ నికరమే. కానీ ఈ వడ్డీ రేట్లు తగ్గడం ఖాయంగా కనిపిస్తోంది. దీంతో ఇలాంటి పొదుపు పథకాల నుంచి వచ్చే ఆదాయమూ క్షీణించనుంది.

- గరుడ

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News