సారాతో అఫైర్​.. నోరువిప్పిన గిల్​..!

Update: 2021-05-29 16:30 GMT
క్రికెట్​ దిగ్గజం సచిన్​ టెండూల్కర్​ కూతురు సారా.. టీమిండియా యువ ఓపెనర్​ గిల్​ మధ్య ఏదో అఫైర్​ నడుస్తోందని సోషల్​ మీడియా కోడై కూస్తున్న విషయం తెలిసిందే. అందుకనుగుణంగానే సోషల్​ మీడియాలో వీళ్లు పోస్టులు కూడా పెడుతుంటారు. ఇక సందర్భంగా వచ్చిన ప్రతిసారి గిల్​.. సారా అఫైర్​ పై వార్తలు పుకార్లు షికార్లు చేస్తుంటాయి.ఇదిలా ఉంటే ఈ వ్యవహారంపై ఇప్పటివరకు ఇద్దరూ నోరు విప్పలేదు.

 కానీ తాజాగా గిల్​ ఈ విషయంపై స్పందించాడు. గిల్​ ఇటీవల ఇన్​స్టా వేదికగా ఫ్యాన్స్​ తో ముచ్చటించారు. ఈ సందర్భంగా పలువురు గిల్ తో వివిధ విషయాలు చర్చించారు. గిల్​ ఇష్టాయిష్టాలు తదితర విషయాలు తెలుసుకున్నారు. ఇక ఔత్సాహికుడైన  ఓ నెటిజన్​ సారా ప్రేమ వ్యవహారంపై పరోక్షంగా ప్రశ్నించాడు. ‘గిల్​ మీరింకా ఒంటరిగానే ఉన్నారా? లేదంటే ఎవరితోనేనా ప్రేమలో ఉన్నారా? ’ అంటూ కామెంటు పెట్టాడు. దీనికి గిల్​ ’ అవును నేను ఒంటరినే’ అంటూ రిప్లై ఇచ్చాడు.

అయితే ఆ తర్వాత కొద్దిసేపటికే గిల్​ తన కామెంట్​ను డిలిట్​ చేయడం గమనార్హం. దీంతో అనుమానాలు మరింత బలపడ్డాయి. గిల్​.. సారా ప్రేమ వ్యవహారం నిజమేమోననన్న ఊహాగానాలు వెలువడుతున్నాయి. ఇదిలా ఉంటే ఆస్ట్రేలియా టూర్​ లో శుభ్​మన్​ గిల్​ హీరో అయిన విషయం తెలిసిందే. గబ్బా వేదికగా జరిగిన మ్యాచ్​ లో 91 పరుగులు సాధించి.. గెలుపులో కీలక పాత్ర పోషించాడు. అయితే ఆ తర్వాత జరిగిన ఇంగ్లండ్​ సీరిస్​, ఐపీఎల్​ లో గిల్​ పెద్దగా రాణించలేకపోయాడు. అయినప్పటికీ గిల్​ ఇంగ్లండ్​ టూర్​ కు సెలెక్ట్ అయ్యాడు. గిల్ ప్రస్తుతం తన ప్రేమ వ్యవహారంపై నోరు విప్పి మరోసారి వార్తలో నిలిచాడు.
Tags:    

Similar News