బోలెడంత టాలెంట్ ఉన్నా.. కాలం కలిసి రాక కొందరి పరిస్థితి దారుణంగా ఉంటుంది. కానీ.. కొందరి జీవితాలు రాజకీయ పరిస్థితుల్లో పూర్తిగా మారిపోతుంది. ఇప్పుడు అలాంటి ఉదంతమే ఒకటి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. అఫ్గాన్ లో మారిన రాజకీయ పరిస్థితుల పుణ్యమా అని అక్కడి ప్రజల జీవితాలు ఎంతలా మారిపోయాయన్న దానికి నిదర్శనంగా ఈ ఉదంతాన్ని చెప్పాలి.
అఫ్గాన్ లో తాలిబన్ల ఏలుబడి మొదలైన నాటి నుంచి ఆ దేశంలోని కోట్లాది మంది జీవితాలు పూర్తిగా మారిపోయాయి. నరరూప రాక్షసులన్న పేరుకు తగ్గట్లే తాలిబన్లు వ్యవహరిస్తూ ఉండటం.. తాము చెప్పిన దానికి భిన్నంగా వ్యవహరిస్తే వెంటనే చంపేయటం తెలిసిందే. వీరి పాలన గురించి అవగాహన ఉన్న చాలామంది ఆస్తుల్ని వదిలేసి.. ప్రాణాల్ని అరచేతిలో పెట్టుకొని దేశం విడిచి వెళ్లిపోయిన వైనం తెలిసిందే.
అఫ్గాన్ గత పాలకుడు హమీద్ కర్జాయ్ ప్రభుత్వంలో పని చేసిన కబీర్ హక్మల్ పోస్టు చేసిన సోషల్ మీడియా పోస్టు ఇప్పుడు సంచలనంగా మారింది. దీనికి కారణం.. టీవీలోయాంకర్ గా.. న్యూస్ రీడర్ గా పని చేసి.. పేరు ప్రఖ్యాతులు సొంతం చేసుకున్న ఒక జర్నలిస్టు మూసా మొహమ్మదీ ప్రస్తుతం ఆఫ్గాన్ రోడ్ల మీద తినుబండారాలు అమ్ముతున్నట్లుగా చెప్పి షాక్ కు గురి చేశారు.
చాలా ఏళ్లు టీవీ చానల్ లో యాంకర్ గా పని చేసిన మూసాకు మంచి పేరే ఉంది. అయితే.. తాలిబన్ల ఏలుబడిలో అతనికి ఉపాధి పోవటం.. కుటుంబాన్ని పోషించుకోవటానికి వీధుల్లో తినుబండారాల్ని అమ్ముకోవాల్సిన పరిస్థితి వచ్చిందన్న విషయాన్ని తన ట్వీట్ తో ప్రపంచానికి తెలియజేశాడు.
ఇతగాడి దీనగాథ సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. తెగ వైరల్ గా మారిన ఈ పోస్టును చూసిన అఫ్గాన్ నేషనల్ రేడియో అండ్ టెలివిజన్ డైరెక్టర్ జనరల్ అహ్మదుల్లా వాసిక్ స్పందించారు. ఇతగాడికి తమ చానల్ లో ఉద్యోగం ఇస్తామన్నారు. అతన్ని నేషనల్ రేడియో అండ్ టెలివిజన్ లో నియమించుకోనున్నట్లు చెప్పారు.
సోషల్ మీడియాలో వచ్చిన ఈ ఉదంతం మాదిరే అఫ్గాన్ లోని న్యూస్ రీడర్లు.. మహిళా యాంకర్ల పరిస్థితి దారుణంగా ఉందని చెబుతున్నారు. తాలిబన్ల ఏలుబడిలో ఎంతోమంది మహిళలు ఉపాధి కోల్పోయిన పరిస్థితి. ప్రస్తుతం తీవ్రమైన ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న ఈ దేశంలో రానున్న రోజుల్లో మరెన్నింటిని ఎదుర్కోవాల్సి ఉంటుందో?