భారత్‌కు చేరిన ఆఫ్గాన్ ఎంపీ.. కన్నీటి పర్యంతం.. భారత్ ఆదుకుందని వ్యాఖ్య
ఆఫ్గానిస్థాన్లో తాలిబన్ల చెర నుంచి భారత్ చేరుకున్న అక్కడి ఎంపీ నరేందర్ సింగ్ ఖల్సా తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. తాలిబన్లు.. ఆఫ్గాన్లో ఎంపీలను ఇబ్బందులు పెడుతున్నారని పేర్కొన్నారు. ఇన్నేళ్లలో సాధించుకున్నదంతా.. నాశనం అయిపోయిందని కన్నీరు పెట్టారు. ఆఫ్గానిస్థాన్ నుంచి భారత్ చేరుకున్న అక్కడి ఎంపీ నరేందర్ సింగ్ ఖల్సా కంటతడి పెట్టారు. 20 సంవత్సరాలుగా తాము నిర్మించుకున్నదంతా.. నాశనం అయిపోయిందంటూ ఆవేదన చెందారు. ఢిల్లీకి ప్రత్యేక విమానంలో చేరుకున్న ఆయనను మీడియా పలకరించింది. దీంతో పలుమార్లు ఆఫ్గన్ పరిస్థితిని తలుచుకుని కన్నీరు పెట్టుకున్నారు.
''నాకు ఇప్పుడు ఏడుపొస్తుంది. 20 ఏళ్లలో మేం సాధించిందంతా.. ఇప్పుడు నాశనం అయిపోయింది. ఇప్పుడు మిగిలింది శూన్యం. ఇంకేం లేదు`` అని ఎంపీ విలపించారు. కాబుల్ విమానాశ్రయం నుంచి భారతీయులతో స్వదేశానికి వచ్చిన సీ-17 యుద్ధవిమానంలో.. 23 మందిఆఫ్గాన్ సిక్కులు కూడా ఉన్నారు. ఇందులోనే భారత్కు చేరుకున్నారు ఖల్సా. తాలిబన్లు ఆక్రమించుకున్న ఆఫ్గానిస్థాన్లో ఇంకా.. 200 మందికిపైగా హిందూ సిక్కులు చిక్కుకున్నారని పేర్కొన్నారు. తనను, తన కుటుంబాన్ని రక్షించినందుకు భారత్కు కృతజ్ఞతలు చెప్పారు. అఫ్గాన్ వీడటం బాధగా ఉన్నా.. ఇండియా తమకు రెండో మాతృదేశం లాంటిదని తెలిపారు.
తాలిబన్లు అక్కడ.. ఎంపీలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఖల్సా చెప్పారు. ఇళ్లలో తనిఖీలు చేయడం సహా.. ఆయుధాలు స్వాధీనం చేసుకుంటున్నారని అన్నారు. ఇదిలావుంటే, అఫ్గాన్ నుంచి బారత్కు చేరుకున్న వారికి కరోనా పరీక్షలు నిర్వహించిన తర్వాతే.. అనుమతిస్తామని కేంద్రం ప్రకటించింది. అదేసమయంలో పోలియో వ్యాక్సిన్‌ను కూడా ఉచితంగా అందిస్తామని.. ఓపీబీ, ఎఫ్ ఐపీవీ వంటి పోలియో ను అరికట్టే వ్యాక్సిన్‌లను అందించనున్నట్టు పేర్కొంది. ఇక, కరోనా నిర్దారణ పరీక్షలైన ఆర్‌టీపీసీఆర్ టెస్టులను ప్రతి ఒక్కరికీ నిర్వహించి.. కరోనా లేదని నిర్ధారించుకున్నాకే అనుమతిస్తామని.. కరోనా నియంత్రణలో భాగంగా ఈ చర్యలు చేపట్టనున్నట్టు భారత అధికారులు తెలిపారు.