అమెరికన్లకు డబ్బులిచ్చి వివాహం చేసుకుంటున్న అప్ఘాన్ మహిళలు

Update: 2021-09-03 16:30 GMT
కరుడుగట్టిన మతచాందసవాదులైన తాలిబన్ల నుంచి తమను తాము రక్షించుకోవడానికి అప్ఘనిస్తాన్ మహిళలు ఎంతకైనా తెగిస్తున్న దారుణ పరిస్థితి ఆ దేశంలో నెలకొంది. కాబూల్ ఎయిర్ పోర్టు బయట దారుణమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. తాలిబన్ల గురించి భయపడుతూ ఆ దేశ పౌరులు వలసపోయేందుకు అక్రమ దారులు వెతుకుతున్నారు.

కొద్దిరోజుల క్రితం ఎయిర్ పోర్ట్ మూసివేయడంతో ఇతర దేశస్థులు వెళ్లేందుకు మాత్రమే కొన్ని విమానాలు తిరుగుతున్నాయి. ఈ క్రమంలోనే తాము విదేశీయుల భార్యలు అని సాక్ష్యం చూపించుకునేందుకు అమెరికన్లను అప్ఘన్ మహిళలు వివాహమాడుతున్నారు. ఇదంతా కాబుల్ విమానాశ్రయం వెలుపలే జరుగుతోంది.

తాలిబాన్ పాలన నుంచి తప్పించుకునేందుకు అమెరికన్లను తమ భర్తలని చెప్పుకొని అప్ఘన్ మహిళలు వెళ్లిపోతున్నారు. దేశాన్ని వదిలి పారిపోవాలనుకుంటున్న అప్ఘన్ మహిళలు కొత్త దారి ఇదే ఎంచుకోవడం గమనార్హం. అలా పెళ్లి చేసుకునేందుకు డబ్బులు కూడా అమెరికన్లకు చెల్లిస్తున్నారు.

అప్ఘన్ వదిలి వెళ్లే క్రమంలో మహిళలు ఇలా అమెరికన్లను పెళ్లాడుతున్నట్టు తెలిసింది. ఈ క్రమంలోనే మహిళలతోపాటు ప్రయాణిస్తున్న మగవారిని సైతం నిషేధించారు తాలిబన్లు. కొన్ని ప్రైవేటు గ్రూపులు మాత్రం అప్ఘాన్స్ పారిపోవడానికి సాయం చేస్తున్నాయి.


Tags:    

Similar News