అఫ్గాన్‌లో అంగట్లో పసిపిల్లలు..ఆకలితో కన్నవారే అమ్మేస్తున్నారు..!

Update: 2021-11-19 05:36 GMT
అఫ్ఘానిస్థాన్ ను తాలిబన్లు వశపరుచుకున్నాక అక్కడివారి బతుకులు అత్యంత దుర్భరంగా మారిపోయాయి. తినడానికి తిండి లేక అలమటిస్తున్నారు. అక్కడ ఆకలి చావులు రోజురోజుకు పెరిగి పోతున్నాయి. చిన్న పిల్లలు తిన‌డానికి తిండి లేక ఆకలితో అలమటిస్తూ అలాగే చనిపోతున్నారు.

ఆహార సంక్షోభం తీవ్రస్థాయికి చేరుకుంది. ప్రజల ఆకలికేకలు తాలిబన్ల కర్కశత్వానికి నిదర్శనంగా వినిపిస్తున్నాయి. కనిపిస్తుననాయి. ప్రజలు ఆకలితో అలమటిస్తున్నారు. డబ్బులేక..చేయటానికి పనిలేక..వేలాది కుటుంబాలు పేదరికంలో మగ్గిపోతున్నాయి. బుక్కెడు తిండి కోసం కన్నబిడ్డల్నే కసాయివారిలా అమ్మేసుకుంటున్నారు.

ఫ్థాన్ ను తాలిబ‌న్లు పాలించ‌డం తో ఆ దేశానికి స‌హాయం చేయ‌డానికి ప్ర‌పంచ దేశాలు వెనక‌డుగు వేస్తున్నాయి. దీంతో ఆఫ్ఘ‌నిస్థాన్ లో రోజు రోజు స‌మ‌స్య‌లు పెరిగిపోతున్నాయి. అఫ్ఘనిస్థాన్‌ లో శాంతి స్థాపనకు ప్రయత్నించి ఘోరంగా విఫలమైంది అమెరికా.

తాలిబన్ల ఆలోచనా విధానాన్ని సరిగ్గా అంచనా వేయలేక బోల్తాపడింది. అఫ్గన్ ప్రభుత్వం, తాలిబన్ల మధ్య రాజకీయ ఏర్పాటు ఊహించిన విధంగా ముందుకు సాగలేదు. దీనికి ప్రధాన కారణం అమెరికానే అంటున్నారు దౌత్యవేత్తలు. ఏదేమైనా పాలన పగ్గాలు చేతులు మారాయి. మరి ఇప్పడు అక్కడి పరిస్థితి ఎలా ఉంది అని ఆరా తీస్తున్నారు పలు దేశాల విశ్లేషకులు. ముఖ్యంగా ఐక్యరాజ్య సమితి ఆందోళన వ్యక్తం చేసిన చిన్నారుల పరిస్థితి గురించి వాకబు చేస్తున్నారు.

అయితే, ప్రపంచ మీడియాకు అక్కడి వాస్తవ పరిస్థితిని చూపించే స్వేచ్ఛ ఇవ్వడంలేదు తాలిబన్లు. ప్రస్తుతం ఆఫ్ఘనిస్తాన్‌ లో ఆకలు కేకలు పెరిగిపోయాయి. పరిస్థితి ఎంతటికి దిగజారింది అంటే .. కేవలం 65 వేల కోసం పిల్లల్ని తల్లిదండ్రులు అమ్ముకుంటున్నారు.

ఆఖరికి ఉయ్యాలలో పడుకున్న బిడ్డను కూడా అమ్మి ఆకలి తీర్చుకుంటున్నారు ఆఫ్ఘన్ పేదలు. ఆ బిడ్డను పెంచి, నడిచే వరకు వచ్చాక తీసుకెళ్తామని అగ్రిమెంట్లు చేసుకుంటున్నారు. తమకు ఐదారుగురు పిల్లలు ఉన్నారని, ఒకరిని అమ్మి మిగతావారి ఆకలి తీరుస్తున్నామని చెబుతున్నారు తల్లిదండ్రులు. ఇందుకు అనేక కారణాలున్నాయి.

ఆగస్టులో తాలిబాన్లు అధికారం చేపట్టిన తరువాత విదేశీ సహాయం పూర్తిగా నిలిచిపోయింది. దాంతో ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పథకాలు, ప్రభుత్వోద్యోగులకు ఇచ్చే జీతలతో సహా ప్రభుత్వ కార్యకలాపాలన్నీ ఆగిపోయాయి. ఫలితంగా అట్టడుగు వర్గాలు దీనస్థితికి చేరుకున్నాయి. ఆగస్టుకు ముందు ఎలాగోలా బతుకీడ్చిన వాళ్ల పరిస్థితి ఇప్పుడు మరింత దుర్భరం అయిపోయింది.

ప్రస్తుతం ఆఫ్ఘనిస్థాన్ దేశంలో ఆహారం లేదు, తాగడానికి నీరు లేదు, మందులు లేదు, విద్య లేదు. ప్రపంచం అభివృద్ధి చెందుతోంది కానీ ఆఫ్ఘనిస్థాన్ తిరోగమనంలో ప్రయాణిస్తూ మధ్యయుగంలోకి వెళుతోంది. ఆఫ్గనిస్తాన్ లోని సుమారు 10లక్షల మంది చిన్నారుల ప్రాణాలు అరచేతుల్లో ఉన్నట్లు తెలుస్తోంది.దేశంలోని మూడోవంతు ప్రజలు ఇప్పటికే ఆహార సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఆఫ్ఘనిస్థాన్ దేశంలో ప్రస్తుతం 4 నుండి 5 మిలియన్లకు పైగా కుటుంబాలు ఆహార కొరతను ఎదుర్కొంటున్నాయి.
Tags:    

Similar News