ఆకలి కోసం అవయవాలు అమ్ముకుంటున్న అప్ఘాన్లు..

Update: 2022-06-24 08:37 GMT
ఓ వైపు తాలిబన్ల పాలన.. మరోవైపు ఆకలికేకలు.. ఇలాంటి తరుణంలో అప్లన్లపై ప్రకృతి పగబట్టింది. భూకంప రూపంలో వచ్చి వందలాది మందిని తుడిచిపెట్టుకుపోంది. ఇప్పటి వరకు 250 మంది మరణించారని లెక్క తేల్చారు. కానీ ఇంకా శిథిలాల కింద అనేక మంది ఉన్నట్లు తెలుస్తోంది. తల్లిదండ్రులు  కోల్పోయి ఒకరు.. తోబుట్టువులు కోల్పోయి మరొకరు.. భూకంప ప్రభావిత ప్రాంతాల్లో ఎక్కడ చూసిని ఇలాంటి వారే కనిపిస్తున్నారు. కడుపు నింపుకోవడానికి కొందరు ఆవురావురుమంటూ ఎదురుచూస్తుంటే.. కడుపు చీల్చుకొని తమవాళ్లను కోల్పోయామని రోదిస్తున్నారు. ఇప్పటికే పేదరికంతో కొట్టుమిట్టాడుతున్న అప్ఘనిస్తాన్ పై ఇప్పుడు ప్రకృతి చూపిన కోపంతో విలవిలలాడుతున్నారు.

అప్ఘనిస్తాన్ ను తాలిబన్లు ఆధీనంలోకి తీసుకున్న తరువాత ప్రపంచ దేశాలు సహాయాన్ని నిలిపివేశాయి. దీంతో దేశంలో ఆహార కొరత తీవ్ర మైంది. దేశంలో ప్రస్తుతం 2 కోట్ల 28 లక్షల మందికి ఆహార కొరత ఉన్నట్లు కొన్ని సంస్థలు నివేదికను బయటపెట్టాయి.

ఇందులో 87 లక్షల మంది ఆకలి చావులకు చేరువయ్యారని తెలిపింది. ఇక దేశంలో 30 శాతం మంది ఒక్కపూట కూడా భోజనం చేయలేని పరిస్థితి దాపురించిందట. మరోవైపు అనారోగ్యం, వ్యాదులు జనాల ప్రాణాలను తీస్తున్నాయి. ఈ సమయంలో భూకంపంతో దేశ పరిస్థితిని మరింత ఆందోళనకు నెట్టింది.

కరువుతో కొట్టుమిట్టాడుతున్న అప్ఘనిస్తాన్ ను ఆదుకోవాలని ఐక్యరాజ్యసమితి ఇప్పటికే పలు దేశాలను కోరింది. అయితే తాలిబన్ల పాలనతో భయపడుతున్న చాలా దేశాలు ముందుకు రావడం లేదు. కొన్ని దేశాలు ముందుకు వచ్చినా తాలిబన్లు వారికి కఠిన ఆంక్షలు పెడుతున్నాుయి. దీంతో మధ్యలో దేశ ప్రజలు నలిగిపోతున్నారు. తాలిబన్లు తీసుకుంటున్న రాజకీయ నిర్ణయాలతో వ్యవసాయం, ఇతర పరిశ్రమలు ఇప్పటికే మూతపడ్డాయి. అటు పెరిగిన నిత్యావసర ధరలతో కడుపు నిండలేని పరిస్థితి ఏర్పడింది.

ఆకలి బాధలు తట్టుకోలేక కొంతమంది తమ అవయవాలను అమ్ముకుంటున్న ఘటనలు ఉన్నాయంటే దేశంలో ఎలాంటి పరిస్థితి ఉందో అర్థం చేసుకోవచ్చు. భూకంపం రాకముందు అంతో ఇంతో ఆరోగ్య వసతులు ఉండేవి. కానీ ఇప్పుడు అవన్ని తుడిచిపెట్టుకుపోయాయి. ఎటు చూస్తున్న అంబులెన్స్  హారన్లు తప్ప వైద్యులు కనిపించడం లేదు. బాధితులకు సాయం చేసేందుకు కొందరు ముందుకు వస్తున్నా కమ్యూనికేషన్, నీటి సదుపాయలు లేక తీవ్ర అవస్థలు పడుతున్నారు.

అయితే రాజకీయ వైరుధ్యాలు పక్కనబెట్టి అప్ఘినిస్తాన్ ను ఆదుకోవాలని కొందరు కోరుతున్నారు. ప్రపంచబ్యాంకు సైతం అప్పులు ఇచ్చే విషయంలో కఠినంగా వ్యవహరిస్తోంది. ఈ పరిస్థితుల్లో బతకడమే గగనంగా మారింది. అయితే పెద్ద మనసు చేసుకొని స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాలని కోరుతున్నారు. లేకుండా అప్ఘనిస్తాన్ లో శిథిలాలు తప్ప మనుషులెవరూ కనిపించే పరిస్థితి ఉండరని ఆందోళన చెందుతున్నారు.
Tags:    

Similar News