అసదుద్దీన్ కంటే అఫ్రిది నయం

Update: 2016-03-15 09:35 GMT
 మజ్లిస్ పార్టీ అధినేత - హైదరాబాద్ ఎంపీ కంటే పాకిస్థానీ క్రికెటర్ షాహిద్ అఫ్రిది ఎంతో నయమట. ఇంతకుముందు అనేకసార్లు ఇండియాకు - ఇండియన్ క్రికెటర్లకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసిన అఫ్రిది ఈసారి ఇండియా పర్యటనలో మాత్రం భిన్నంగా మాట్లాడుతున్నారు. భారత్ లో తమకు లభిస్తున్న ఆతిథ్యం - కల్పిస్తున్న భద్రత సొంత దేశం పాక్ లో కూడా దొరకదని ఆయన ఇప్పటికే అన్నారు. అయితే.... ఆయన మాటలు పాకిస్థానీ మాజీ క్రికెటర్ మియాందాద్ కు కోపం తెప్పించాయి. ఆయన అఫ్రిదికి చీవాట్లు పెట్టాడు. మరోవైపు తన వ్యాఖ్యల ద్వారా అఫ్రిది పాకిస్థాన్‌ ప్రజల మనోభావాలను దెబ్బతీశాడంటూ పాకిస్తాన్ లో ఓ న్యాయవాది అఫ్రిది కి లీగల్‌ నోటీసు కూడా పంపాడు. అఫ్రిది పాకిస్తాన్ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశాడు. తన వ్యాఖ్యలపై దుమారం రేగడంతో అఫ్రిది వివరణ ఇచ్చే ప్రయత్నం చేశాడు.  పాజిటివ్‌ గా మాట్లాడాలని అలా అన్నానే తప్ప తనకు మరో ఉద్దేశం లేదని తేల్చి చెప్పాడు.

కాగా ప్రత్యర్థి దేశానికి చెందిన ప్రముఖుడు తమ దేశం నుంచి వస్తున్న విమర్శలను సైతం లెక్క చేయకుండా ఇండియాను పొగుడుతుంటే ఇండియాలో పుట్టిన అసదుద్దీన్ మాత్రం మాతృదేశానికి జై అనడానికి కూడా నిరాకరిస్తున్నారు. భారత్ మాతాకీ జై అన్న మాట తన నోటి నుంచి రావడం అసంభవం అని ఆయన కుండ బద్ధలు కొట్టి చెబుతున్నారు. దీంతో ప్రజలు అసద్ కంటే అఫ్రిది బెటర్ అంటున్నారు.
Tags:    

Similar News