పొగిడినందుకు దేశానికి క్ష‌మాప‌ణ‌లు చెబుతాడా?

Update: 2016-03-14 11:33 GMT
అనుకున్న‌దే జ‌రిగింది. టీ20 వ‌రల్డ్ కప్ క్రికెట్ టోర్నీలో పాల్గొనేందుకు భార‌త్ లోకి అడుగు పెట్టిన పాక్ జ‌ట్టు కెప్టెన్ షాహిద్ అఫ్రిది స‌మ‌స్య‌ల్ని కొని తెచ్చుకున్నాడు. మీడియాతో మాట్లాడిన సంద‌ర్భంగా ఆయ‌న చేసిన వ్యాఖ్య‌లు పాక్ లో ఆగ్ర‌హం వ్య‌క్త‌మ‌వుతోంది. త‌మ సొంత దేశంలో కంటే త‌మ‌కు భార‌త్ లోనే ఎక్కువ ప్రేమాభిమానాలు ల‌భిస్తున్నాయంటూ అఫ్రిది చేసిన వ్యాఖ్య‌ల‌పై పాక్ కు చెందిన ఒక న్యాయ‌వాది తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేయ‌ట‌మే కాదు.. అత‌న్ని త‌ప్పు ప‌డుతూ నోటీసులు జారీ చేశారు.

అఫ్రిదీ చేసిన వ్యాఖ్య‌లు దేశ ప్ర‌యోజ‌నాల్ని దెబ్బ తీసేలా ఉన్నాయ‌ని.. త‌న వ్యాఖ్య‌ల్నిఉప‌సంహ‌రించుకొని దేశానికి క్ష‌మాప‌ణ‌లు చెప్పాల‌న్న డిమాండ్ చేస్తూ పాక్ లాయ‌ర్ నోటీసు పంపారు. ఆదివారం మీడియాతో మాట్లాడిన అఫ్రిది భార‌త్‌లో ఆడ‌టాన్ని ఎంజాయ్ చేస్తున్నామ‌ని.. త‌మ దేశంలో కంటే భార‌త్‌లోనే త‌మ‌ను అభిమానిస్తారంటూ వ్యాఖ్య‌లు చేశారు. భార‌తీయుల‌కు తామంటే ఎంతో ఇష్ట‌మ‌ని చెప్పుకునే క్ర‌మంలో లేనిపోని స‌మ‌స్య‌ల్లో అఫ్రిదీ ఇరుక్కున్నార‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది.
Tags:    

Similar News