బీజేపీ సారథ్యంలోని ఎన్డీయే కూటమిలో కీలక పార్టీ అయిన శివసేన సంచలన ప్రశ్న సంధించింది. మిత్రపక్ష బీజేపీ తీరును సందర్భానుసారం ఎండగట్టే సేన తాజాగా ప్రభుత్వ రంగ సంస్థ ఎయిర్ ఇండియాను ప్రైవేటీకరించాలన్న కేంద్ర నిర్ణయాన్ని విపక్షాలతోపాటు కూడా ప్రశ్నించింది. మహారాజా (ఎయిర్ ఇండియా లోగో) బికారిగా మారడానికి కారణాలేమిటో కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ వివరించాలని డిమాండ్ చేసింది. ఒకవేళ ఒక విమానయాన సంస్థనే నడుపలేని నరేంద్రమోడీ ప్రభుత్వం.. దేశాన్ని ముందుకు తీసుకెళుతుందని విశ్వసించలేమని పేర్కొంది. భద్రతా వ్యయం భరించలేమనే పేరుతో కాశ్మీర్ ను కూడా విక్రయిస్తారా? అని శివసేన అధికార పత్రిక సామ్నా సంపాదకీయం నిలదీసింది.
ఎయిర్ ఇండియాలో వాటాల విక్రయంపై సరికాదని దాన్ని దారిలో పెట్టేందుకు తగు చర్యలు తీసుకోవడంలో మొదటి నుంచి వైఫల్యం కనిపిస్తోందని సామ్నా పేర్కొంది. ఎయిర్ ఇండియాను నడిపించాలనే మనోబలం ఉంటే, దాన్ని చక్కదిద్దేందుకు ఎన్నో మార్గాలు కేంద్ర ప్రభుత్వం చేతుల్లో ఉన్నాయని సామ్నా వ్యాఖ్యానించింది. అయినప్పటికీ మోడీ సర్కారు చేతులు ఎత్తేసిందని శివసేన అధికార పత్రిక మండిపడింది. కాగా, బుర్దాన్ లో జరిగిన సభలో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత - పశ్చిమబెంగాల్ సీఎం మమతాబెనర్జీ మాట్లాడుతూ ఎయిర్ ఇండియాను విక్రయించాలన్న కేంద్ర నిర్ణయానికి మద్దతు ఇవ్వబోమన్నారు.
కాగా, ప్రభుత్వ రంగ సంస్ధ ఎయిరిండియాను ప్రైవేటీకరించాలన్న మోడీ ప్రభుత్వం నిర్ణయాన్ని సీపీఎం పొలిట్ బ్యూరో తీవ్రంగా వ్యతిరేకించింది. ఎయిరిండియాతో పాటు దాని అనుబంధ సంస్థలు ఐదింటిలోనూ పెట్టుబడుల ఉపసంహరణకు కేంద్ర కేబినెట్ సూత్రప్రాయ అంగీకారాన్ని తెలపడంపై ఒక ప్రకటనలో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. 2008 నుంచి నష్టాల్లో నడిచిన ఎయిరిండియా ఇప్పుడిప్పుడే లాభాల బాట పడుతున్న సమయంలో కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం సరైంది కాదని పేర్కొంది. 2015-16 సంవత్సరంలో రూ.105 కోట్లు లాభాలను ఆర్జించిందని, 2016-17 సంవత్సరంలో రూ.300 కోట్లు లాభాలు ఆర్జించనున్నట్లు అంచనా వేసిందని పొలిట్ బ్యూరో తన ప్రకటనలో తెలిపింది. కేంద్రంలో కొనసాగిన గత ప్రభుత్వాల తప్పుడు నిర్ణయాల వలనే ఎయిరిండియా నష్టాలకు గురికావాల్సి వచ్చిందని విమర్శించింది. ఇప్పుడు దానిని బలిపశువుగా చేసి ప్రైవేటీకరిస్తున్నారని విమర్శించింది. ఎయిరిండియాను కొనుగోలు చేయడానికి ముందుకొచ్చిన ప్రైవేటు వ్యక్తికి రూ.30 వేల కోట్ల రుణ భారాన్ని రద్దు చేసి మరీ అప్పగిస్తుందని పొలిట్ బ్యూరో పేర్కొంది. ఎయిరిండియాను ప్రైవేటీకరించడం ప్రజల సొమ్మును పొదుపు చేసేందుకు కాదని, దేశ - విదేశీ ప్రైవేటు కంపెనీల లబ్దికోసం ప్రభుత్వ ఖజానాను నష్టపరిచేందుకేనని పొలిట్ బ్యూరో పేర్కొంది. జాతి ప్రయోజనాలకు వ్యతిరేకంగా అన్నింటినీ ప్రైవేటీకరించడంలో భాగంగానే ఎయిరిండియాను కూడా మోడీ ప్రభుత్వం ప్రైవేగాకరిస్తోందని పేర్కొంది. ఎయిరిండియాను ప్రైవేటీకరించే ప్రక్రియను తక్షణమే నిలిపివేయాలని పొలిట్ బ్యూరో డిమాండ్ చేసింది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/