సీఎం జగన్ తియ్యటి మాటల తర్వాత ఏపీ అసెంబ్లీ ఆవరణలో ఆ రచ్చ

Update: 2022-09-15 10:30 GMT
ఏ మాటకు ఆ మాటే చెప్పాలి. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని అంచనా వేయటం అంత తేలికైన విషయం కాదు.ఆయన్ను అంచనా వేసినట్లుగా గొప్పలకు ఫీలైతే వారికి మించిన అమాయకుడు.. తెలివితక్కువ సన్నాసి మరొకరు ఉండరు. అంచనాలకు భిన్నంగా వ్యవహరించటం.. ఎప్పుడు ఎలాంటి మూడ్ ఆయనకు ఉంటుందో చెప్పటం అంత తేలికైన విషయం కాదు. జగన్ తీరు అంచనాలకు భిన్నంగా ఉంటుందన్న దానికి నిదర్శనంగా గురువారం ఏపీ అసెంబ్లీ భవనంలో జరిగిన రెండు ఉదంతాల్ని ప్రస్తావిస్తున్నారు.

అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో విపక్షంతో కలిసిన అధికారపక్షం.. సభ ఎజెండా ఎలా ఉండాలనే దానికి బీఏసీ (బిజినెస్ అడ్వైజరీ కమిటీ) సమావేశాన్ని నిర్వహించారు. దీనికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కూడా హాజరయ్యారు.

ఈ సందర్భంగా అసెంబ్లీలో ఏ అంశం మీదనైనా చర్చించేందుకు అధికారపక్షం సిద్ధంగా ఉందని.. సభను కొనసాగేలా విపక్ష టీడీపీ సహకరించాలన్న సీఎం జగన్ మాట ఆసక్తికరంగా మారింది. కావాలంటే రాజధానుల అంశం మీదా మాట్లాడదామన్న ఆఫర్ ను అచ్చెన్నకు ఇచ్చారుజగన్.

విపక్షానికి.. విపక్ష నేతల్ని ఉద్దేశించి సీఎం జగన్ మాట్లాడిన మాటలకు విస్మయానికి గురైన తెలుగు తమ్ముళ్లకు.. దాని  నుంచి బయటకు రాక ముందే ఊహించని షాక్ తగిలింది. అసెంబ్లీ ప్రాంగణంలోకి టీడీపీ ఎమ్మెల్యేల వాహనాల్ని అనుమతించని వైనంపై టీడీపీ ఎమ్మెల్యేలు విస్తుపోయే పరిస్థితి. ఈ అంశంపై పోలీసులతో వారు వాగ్వాదానికి దిగారు. ఆ సమయంలోనే వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి వాహనంఅసెంబ్లీ లోపలకు వెళ్లటాన్ని వారు ప్రశ్నించారు.

అసెంబ్లీ లోపలకు వెళ్లిన విజయసాయి వాహనంలో ఆయన లేకపోవటాన్నిప్రస్తావించిన తెలుగు దేశం ఎమ్మెల్యేలు.. ఎంపీ లేకున్నా ఆయన పీఏ ప్రయాణిస్తున్న వాహనాన్ని లోపలకు అనుమతిస్తున్నారు? ఎమ్మెల్యేలమైన మా వాహనాల్ని మాత్రం ఎందుకు అనుమతించరు? అంటూ మండిపడ్డారు.

అయినప్పటికీ పోలీసులు ససేమిరా అనటంతో టీడీపీ ఎమ్మెల్యేలు విస్తుపోయే పరిస్థితి. ఎమ్మెల్యేల వాహనాల్ని నిలిపేసి.. ఎంపీ వాహనాన్ని ఎలా అనుమతిస్తారంటూ వారు అడిగిన ప్రశ్నలకు పోలీసులు సమాధానం చెప్పని వైనం టీడీపీ ఎమ్మెల్యేలకు కాలిపోయేలా చేసింది. తియ్యటి మాటలతో బీఏసీ మీటింగ్ లో మాట్లాడిన సీఎం జగన్.. అందుకు భిన్నంగా అసెంబ్లీ ప్రాంగణలోకి విపక్ష ఎమ్మెల్యేల వాహనాల్ని అనుమతించని వైనం చూసినోళ్లు.. జగనా మజాకానా?అనేస్తుండటం గమనార్హం.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News