సిమ్లా.. శ్యామ్లాగా మారే రోజు వచ్చేసినట్లే

Update: 2016-04-16 06:08 GMT
ఇటీవల కాలంలో ఊళ్ల పేర్లను మార్చే ధోరణి పెరుగుతోంది. భావోద్వేగాలకు తగ్గట్లుగా రాజకీయ నాయకులు తీసుకుంటున్న నిర్ణయాల పుణ్యంగా చాలా ప్రాంతాల పేర్లు వరుసగా మారిపోతున్నాయి. ఆ మధ్యన రాజమండ్రి పేరును రాజమహేంద్రవరంగా మారుస్తూ ఏపీ సర్కారు నిర్ణయం తీసుకోవటం తెలిసిందే. ఇక.. ఐటీకి కేరాఫ్ అడ్రస్ గా చెప్పుకునే గుడ్ గావ్ ని ‘గురుగ్రామ్’గా మారుస్తూ నిర్ణయం తీసుకున్నారు.

గుడ్ గావ్ ని.. గురుగ్రామ్ గా మార్చేసిన నేపథ్యంలో దేశంలోని కొన్ని నగరాలకు పేర్లు మార్చాలన్న డిమాండ్లు పెరిగాయి. ఇందులో ప్రముఖంగా వినిపిస్తోంది ప్రముఖ పర్యాటక ప్రాంతంగా పేరున్న సిమ్లాను శ్యామ్లాగా మార్చాలన్న డిమాండ్ ఊపందుకుంది. బ్రిటీషర్ల హయాంలో వేసవి రాజధానిగా ఉన్న ఈ ప్రాంతాన్ని శ్యామ్లాగా పిలిచే వారని.. ఆ తర్వాతనే దాన్ని సిమ్లాగా మార్చినట్లు చెబుతున్నారు. ఈ నగరం పేరును వెంటనే మార్చాలని డిమాండ్ చేస్తున్నారు. శ్యామ్లా అంటే నీలి రంగు ఇల్లు అని.. ఆ ఊరి జాఖూ కొండ మీద ఒక ఫకీర్ దాన్ని నిర్మించారని.. ఆ ఇంటి కారణంగానే ఆ ప్రాంతానికి శ్యామ్లా అన్న పేరు వచ్చినట్లుగా అక్కడి వారు చెబుతున్నారు. దీనికి తోడు కాళిమాతను శ్యామ్లాగా కూడా వ్యవహరిస్తారని.. ఈ నేపథ్యంలో సిమ్లా పేరు మార్చాలని డిమాండ్ చేస్తున్నారు.

ఇదిలా ఉంటే.. సిమ్లాతో పాటు.. డల్హౌసీ హిల్ టౌన్ కి నేతాజీ సుభాష్ చంద్రబోస్ పేరు పెట్టాలని.. సిమ్లాలోని చారిత్రక పీటర్ హాఫ్ బిల్డింగ్ కు వాల్మీకీ సదన్ గా మార్చాలని కోరుతున్నారు. తాజాగా వినిపిస్తున్న డిమాండ్లపై ప్రభుత్వం కానీ సానుకూలంగా స్పందిస్తే.. చాలానే పేర్లును మార్చుకోవాల్సి ఉంటుందన్న మాట.
Tags:    

Similar News