ఇండోనేషియాలో జరుగుతున్న ఆసియా క్రీడల్లో స్వర్ణం సాధించిన రెజ్లర్ వినేశ్ ఫోగట్ కు ఇప్పుడు బోలెడుమంది అభిమానులు. నిన్న మొన్నటి వరకూ ఆమె తెలియని వారు సైతం.. ఆమె సాధించిన గోల్డ్ తో ఒక్కసారిగా ఫేమస్ అయిపోయారు. ఆమె విజయానికి అభినందనలు వెల్లువెత్తాయి. ఆసియా క్రీడల్లో బంగారు పతకం సాధించిన తొలి మహిళా రెజ్లర్ గా ఆమె చరిత్ర సృష్టించారు.
ఇదిలా ఉంటే.. తాను సాధించిన పతకంతో ఢిల్లీ ఎయిర్ పోర్ట్ కు చేరుకున్నారు.ఈ సందర్భంగా ఒక ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. పుట్టిన రోజున బర్త్ డే విషెస్ చెబుతూ ఎయిర్ పోర్ట్‌లో స్వాగతం పలికారు.ఈ సందర్భంగా ఆమె స్నేహితుడు సోమ్ వీర్ తో ఎంగేజ్ మెంట్ ను సింఫుల్ గా జరిపించారు. ఈ సందర్భంగా కొత్త జంట ఉంగరాలు మార్చుకోవటమే కాదు.. కేక్ కట్ చేసి తమ సంతోషాన్ని పంచుకున్నారు.
ఇంతకీ ఈ సోమ్ వీర్ ఎవరంటారా? వినేశ్ ఫోగట్ కష్టకాలంలో ఉన్నప్పుడు ఆమెకు అండగా నిలిచారు.గ్రీకో రోమన్ రెజ్లర్ అయిన సోమ్ వీర్ 2016 ఒలింపిక్స్ నుంచి మోకాలి గాయంతో తిరిగి వచ్చిన ఆమెను కోలుకొని ఆటలో రాణించేలా కీలక భూమిక పోషించారు.
తన ఎంగేజ్ మెంట్ పై సోషల్ మీడియాలో పోగట్ స్పందించారు. బర్త్ డే వేళ శుభాకాంక్షలు చెప్పి ప్రత్యేకమైన అనుభూతిని మిగిల్చిన అందరికి తాను ధన్యవాదాలు తెలిపారు. తనకు విషెస్ చెప్పిన అందరికి ఆమె తలవంచి నమస్కరిస్తున్నట్లు పేర్కొన్నారు. తన జీవితంలో ఈ మధురక్షణాలు ఎప్పటికి మర్చిపోలేవన్నారు. నచ్చిన వాడు.. మనసు నెచ్చినవాడు.. కష్టకాలంలో అండగా ఉన్నోడు జీవితభాగస్వామిగా మారటం ఒక ఎత్తు అయితే.. ఫాంటసిక్ గా ఎయిర్ పోర్ట్ లో జరిగిన ఎంగేజ్ మెంట్ మరింత హ్యాపీగా మారుస్తుందనటంలో సందేహం లేదు.