జమ్ము కశ్మీర్ లోని కథువాలో ఎనిమిదేళ్ల చిన్నారి ఆసిఫా గ్యాంగ్ రేప్, హత్య ఘటన ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. ఈ దారుణ ఘటనకు నిరసనగా సోషల్ మీడియాలో రకరకాల నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఆ నిందితులకు, వారికి మద్దతిచ్చిన బీజేపీ మంత్రులకు వ్యతిరేకంగా పలు రకాల పోస్ట్ లు వెలువడుతున్నాయి. తాజాగా, కేరణలోని చెంగనూరు నియోజకవర్గంలో కొన్ని ఇళ్ల ముందు వినూత్న తరహాలో ప్లకార్డులు వెలిశాయి. తమ ఇంట్లో రజస్వల కాని ఆడ పిల్లలలున్నారని, అందువల్ల ఓట్లు అడిగేందుకు బీజేపీ నేతలు తమ ఇళ్లకు రావద్దని కొంతమంది తమ ఇళ్ల ముందు ప్లకార్డులు ప్రదర్శించారు. త్వరలో చెంగనూరు ఉప ఎన్నిక జరగనున్న నేపథ్యంలో ఆ ప్లకార్డులు ప్రాధాన్యాన్ని సంతరించుకున్నాయి.
కేరళలో శబరిమలకు అతి సమీపంలో ఉన్న చెంగనూరు నియోజకవర్గ ఎమ్మెల్యే రామచంద్రన్(సీపీఐ-ఎం) మరణించడంతో ఆ నియోజక వర్గానికి త్వరలో ఉప ఎన్నిక జరగబోతోంది. 2019 సాధారణ ఎన్నికలకు ముందు జరుగబోతోన్న ఈ ఉప ఎన్నికను కాంగ్రెస్ - బీజేపీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఈ నేపథ్యంలో సీపీఐ-ఎం నేతలు తమ ఇళ్ల ముందు గేట్లకు ఆ ప్లకార్డులను ప్రదర్శించారు. కేరళలో వామపక్ష నేతలకు, బీజేపీ నేతలకు మధ్య గతంలో మాటల యుద్ధం నడిచిన నేపథ్యంలో కథువా ఉదంతం ...సీపీఐ నేతలకు ఆయుధంగా దొరికింది. దీంతో, వారు బీజేపీపై తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. ఈ ఇళ్లకు పెట్టిన ప్లకార్డుల ఫొటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.