మ‌ళ్లీ ఇంకు ప‌డింది

Update: 2015-10-30 17:11 GMT
శివ‌సేన ఇటీవ‌ల త‌ర‌చూ వార్త‌ల్లో నిలుస్తోంది. ఇన్నాళ్లు క్రికెట్ పోటీల‌ను అడ్డుకోవ‌డం ద్వారా, బీజేపీపై విమ‌ర్శ‌లు చేయ‌డం ద్వారా వార్త‌ల్లోకి ఎక్కిన శివ‌సేన కొద్దికాలం క్రితం ఇంకు దాడి చేసిన సంగ‌తి తెలిసిందే. తాజాగా మ‌రోమారు మహారాష్ట్రలో అదే ప‌ని చేసింది. లాతూర్ లోని మత్వాడా ప్రాంతంలో సమాచార హక్కు చట్టం ఉద్యమకారుడిపై శివసేన కార్యకర్తలు దాడి చేశారు. అంత‌టితో ఆగిపోకుండా అతని మొహంపై ఇంకు చల్లారు. మల్లికార్జున్ భాయ్ కట్టి అనే ఆర్ టీఐ ఉద్యమకారుడు లాతూర్-నాందేడ్ రహదారిపై చేపట్టిన అక్రమ కట్టడానికి సంబంధించిన వివరాలను గురువారం బహిర్గతపరిచాడు. భాయ్ కట్టి చర్యతో ఆగ్రహించిన శివసేన కార్యకర్తలు అతనిపై దాడి చేసి ఇనుపరాడ్డుతో చితకబాదారు. అనంతరం సిరాతో ముఖాన్ని నల్లగా మార్చేశారు.

మల్లిఖార్జున్ బ్లాక్ మెయిల్ కు పాల్పడుతున్నాడని శివసేన కార్యకర్తలు ఆరోపించారు. గతంలో శివసేన కార్యకర్తలు అబ్జర్వర్ రీసెర్చ్ ఫౌండేషన్  చైర్మన్ సుధీంద్ర కులకర్ణిపై దాడికి పాల్పడిన విషయం తెలిసిందే.  శివసేన కార్యకర్తల సిరా దాడులపై విమ‌ర్శ‌లు చెల‌రేగిన‌ప్ప‌టికీ ఆ పార్టీ కార్య‌క‌ర్త‌లు ఏ మాత్రం త‌మ చ‌ర్య‌ల‌ను నిలుపుద‌ల చేసుకోవ‌డం లేదు. త‌మ పంథాను మార్చుకోక‌పోవ‌డంపై ప‌లువురు దుయ్య‌బ‌డుతున్నా ఠాక్రే వార‌సులు మాత్రం అదే ప‌నితో ముందుకుపోతున్నారు.
Tags:    

Similar News