భార్య కాదు భారీ బిస్కెట్. అవును.. అమాయకంగా ఉన్నట్లు కనిపించే ఈ కిలేడీ గురించి తెలిస్తే షాక్ తినాల్సిందే. గుండెలు తీసిన బంటు అన్న మాట విని ఉంటారే కానీ.. అలాంటి బుద్ధులతో ఒక లేడీని తయారు చేస్తే.. ఇప్పుడు చెప్పే యువతికి ఏమాత్రం తీసిపోని రీతిలో ఉంటుంది. చూసినంతనే ఆకట్టుకునే రూపం. అమాయకంగా కనిపించే ఆమె ముఖానికి తగ్గట్లే.. ఆమె మాటలు కూడా ఉంటాయి. ఇంకేముంది పురుష పుంగవులకు షాకుల మీద షాకులిచ్చే ఈ అమ్మడి వ్యవహారం ఒక ఎత్తు అయితే.. తాజాగా బాధితుడైన ఒక భర్త గారి ఆవేదన మరో ఎత్తు.
మోసం చేయాలంటే మోసపోవటానికి సిద్ధంగా ఉన్నప్పుడే సాధ్యమవుతుంది. ఈ మాటకు తగ్గట్లే ఈ ఉదంతం కనిపిస్తుంది. భారీ బిస్కెట్ వేసి.. మోసపోయిన తర్వాత కూడా.. నో.. నో.. నాకు ఆమే కావాలంటూ సదరు భర్త పడుతున్న తపనను చూసినోళ్లంతా ముక్కున వేలేసుకుంటున్నారు. ఈ విచిత్రమైన ఉదంతం గురించి పూర్తిగా తెలుసుకోవాలంటే ఉత్తరప్రదేశ్ వెళ్లాల్సిందే. ఇంతకూ అసలేం జరిగిందంటే..
యూపీలోని కాన్పూరుకుచెందిన అమిత్ శర్మ అనే యువకుడు.. గోవింద్ నగర్ కు చెందిన రుచివర్మను ప్రేమించాడు. వారి ప్రేమకు పుల్ స్టాప్ పెట్టేసి సంసార సాగరంలోకి దిగేందుకు రెఢీ అయ్యారు. ఇద్దరు పెళ్లి చేసుకోవటానికి డిసైడ్ అయ్యాక.. పెద్దల అనుమతి తీసుకొని ఆర్యసమాజ్ లో పెళ్లి చేసుకున్నారు. అదేంటి? పెద్దలు ఓకే చెప్పిన తర్వాత కూడా అంత సింఫుల్ గా పెళ్లి చేసుకోవటానికి కారణం కరోనా ఎఫెక్టు అని చెప్పినా.. ఈ మాయలేడీ వేసిన మాస్టర్ ప్లాన్ గా చెబుతారు. చాలా తక్కువ మంది మధ్య పూర్తి అయిన పెళ్లి కార్యక్రమం.. ఆ తర్వాత కాపురం పెట్టేశారు యువజంట. కొద్ది రోజుల పాటు వీరి కాపురం సాఫీగా సాగింది.
ఇదిలా ఉండగా.. ఒక రోజు రుచివర్మ తల్లి ఇంటికి వచ్చి..బంధువుల పెళ్లి ఉందని తీసుకెళ్లేందుకు వచ్చింది. దీంతో పుట్టింటికి వెళుతున్న భార్యకు రూ.50వేల నగదుతో పాటు.. మరికొంత బంగారాన్ని ఇచ్చి పంపాడు. క్యాలెండర్లో రోజులు గడిచిపోతున్నాయే తప్పించి.. భార్య మాత్రం ఇంటికి రావటం లేదు. దీంతో.. ఫోన్ మీద ఫోన్ చేసినా తీయలేదు. కొద్దిరోజులకు ఫోన్ స్విఛాప్ కావటంతో ఆందోళనతో అత్తారింటికి వెళ్లాడు. అక్కడికి వెల్లిన అతడికి దిమ్మ తిరిగే షాక్ ఎదురైంది.
తన భార్య రుచివర్మ మరో వ్యక్తిని పెళ్లాడేందుకు సిద్ధం కావటం.. అందుకు ఆమె తల్లి సహకరించటం చూసిన తర్వాత తట్టుకోలేకపోయాడు. ఇదేమిటని నిలదీసినా ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయింది. అసలు తన భార్యను తీసుకెళ్లిందే మరో పెళ్లి చేసేందుకే అన్న నిజం తెలిసిన అతను తట్టుకోలేకపోయాడు. తానుమోసానికి గురయ్యానని తెలుసుకొని.. వారి గురించి ఆరా తీయటం మొదలు పెట్టాడు. ఈ సందర్భంగా మరిన్ని షాకింగ్ నిజాలు బయటకు వచ్చాయి. తనకు ముందు రుచిశర్మకు పలువురితో పెళ్లిళ్లు అయ్యాయని తెలియటంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
రంగంలోకి దిగిన పోలీసులు విచారణ చేయగా.. వారికి మరిన్ని కొత్త విషయాల్ని గుర్తించారు. పెళ్లి పేరుతో అమ్మాకూతుళ్లు ఇద్దరు కలిసి మోసం చేస్తారని.. పెళ్లి చేసుకొని కొద్దిరోజులు ఉండి.. అందినకాడికి సొమ్ములు చేజిక్కించుకొని ఉడాయిస్తారని గుర్తించారు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు అమ్మాకూతుళ్లను అరెస్టు చేశారు. ఇక్కడ ట్విస్టు ఏమంటే.. మామూలుగా అయితే పెళ్లి పేరుతో భారీ బిస్కెట్ వేసిన భార్యకు భారీ శిక్ష పడేలా ప్రయత్నించాల్సింది పోయి... భార్యతో కాపురం చేయాలని అనుకుంటున్నానని చెబుతున్నాడట.
అంతేకాదు.. ఏదోలా చేసి తన భార్యను తన వద్దకు పంపాలని బతిమిలాడుతున్న ఈ భర్త వ్యవహారం ఇప్పుడు సంచలనంగా మారింది. తాను కాపురం చేయాలని బావిస్తున్నది భార్యతో కాదు ముదురు టెంక అయిన కిలేడీతో అన్న విషయం ఇతగాడికి ఎందుకు అర్థం కావట్లేదన్న సందేహం పలువురికి కలుగుతోంది. ఈ సిత్రమైన రిక్వెస్టును ఎలా డీల్ చేయాలో అర్థం కాక అక్కడి పోలీసులు తల పట్టుకుంటున్నట్లు చెబుతున్నారు.