ఏపీ రాజధానిగా అమరావతి. అందరూ మెచ్చింది. చాలా మందికి నచ్చింది. కానీ.. కొందరికి మాత్రం అస్సలు నచ్చలేదు. అందునా.. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి నచ్చని తర్వాత.. ఆయన్ను అమితంగా ప్రేమించే వారికి.. ఆరాధించే వారికి సైతం అమరావతి అంటరానిదిగా మారింది. అమరావతిని రాజధానిగా ఎలా చేస్తారండి? అన్న ప్రశ్నతో పాటు.. సంబంధం లేని వాదనల్ని.. అర్థం లేని లాజిక్కుల్ని తీసుకొస్తూ.. మూడు రాజధానులపై వినిపిస్తున్న వాదనలు విన్నోళ్లంతా ఆశ్చర్యపోయే పరిస్థితి.
2019 ఎన్నికలకు ముందే అమరావతి ఒక షేప్ కు రాకున్నా.. దానికి సంబంధించిన చాలా పనులు వాయువేగంతో జరిగాయన్న వాస్తవాన్ని విస్మరించి.. అవన్నీ గ్రాఫిక్స్ అన్న వాదనకు ఓటు వేయటమే కాదు.. వాస్తవాన్ని వదిలేసి.. అర్థం లేని అబద్ధాన్ని అంతకంతకూ అందంగా అభివర్ణిస్తున్న వైనం చూస్తే నోట మాట రాని వారెందరో అమరావతిని కేవలం ఉమ్మడి గుంటూరు.. క్రిష్ణా జిల్లాల వారు తప్పించి మరెవరూ మద్దతు ఇవ్వట్లేదన్న మాటను ప్రచారం చేయటం.. అందులో నిజం ఎంతన్నది వదిలేసి.. అమరావతికి సమాధి కట్టే ప్రయత్నాలు కొందరు చేస్తున్నారు. ఇలాంటి వేళ.. సోషల్ మీడియాలో వైరల్ గా మారిన ఒక పోస్టు ఆసక్తికరంగా మారింది.
తనది ఉత్తరాంధ్రకు చెందిన విజయనగరం జిల్లా అని చెబుతూ.. మాకిరెడ్డి సూరిదేవుడు అనే వ్యక్తి పెట్టిన పోస్టు చదివినోళ్లంతా ఫిదా కావటమే కాదు.. ఏపీ రాజధానిగా అమరావతి ఎందుకన్న విషయాన్ని ఎంత బాగా చెప్పారో అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ పోస్టును సాపేక్షంగా చదివినోళ్లంతా మూడు రాజధానుల కంటే అమరావతి రాజధానితో జరిగే లాభం ఎంతన్న విషయాన్ని ఒప్పేసుకుంటున్న పరిస్థితి. ఇంతకీ ఆ పోస్టులో ఏముంది? అన్నది యథాతధంగా చూస్తే..
నా జిల్లా విజయగరం. నా ఊరు రామయ్యపాలెం. విశాఖ జిల్లాకు అర కిలోమీటర్. నా రాజధాని అమరావతి. ఏపీ రాజధానిని అమరావతిలోనే ఎందుకు ఉంచాలి?
- అమరావతి ఇప్పుడు నడుస్తున్న రాజధాని. విశాఖపట్నం మళ్లీ అన్నీ మొదలుపెట్టాలి.
- అమరావతి ముంపు లేదు. విశాఖపట్నం తుఫానులు వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే హుద్ హుద్ తుఫానుతో విశాఖపట్నం ఒకసారి కకావికలమైంది.
- అమరావతి తీరానికి 80 కిలోమీటర్ల పైగా దూరంగా ఉంది. రేపు ఏదైనా శత్రుదేశాలతో యుద్ధం వస్తే.. రక్షణ పరంగా టార్గెట్ కాదు కాబట్టి భయం ఉండదు. విశాఖపట్నం.. దేశం మొత్తం మీద తూర్పు తీరాన రక్షణ పరంగా ఉన్న అతి కీలకమైన ప్రదేశం.బోలెడన్ని సైనిక కేంద్ర స్థావరాలు ఉన్నాయి. శత్రుదేశంతో యుద్ధం అంటూ జరిగితే మొదట బలి అయ్యేది విశాఖపట్నమే.
- అమరావతి(గుంటూరు జిల్లా)కి అటు 06 జిల్లాలు ఇటు 06 జిల్లాల మధ్యలో ఉంది. ఎమ్మెల్యేలు 84 ఒకవైపు 74 ఇంకోవైపు. ఎంపీలు అటు 12 మంది, ఇటు 12 మంది. దూరం విషయానికి వస్తే అటు 600 కిలోమీటర్లు. ఇటు 600 కిలోమీటర్లు. జనాభా 2.35కోట్లు ఒకవైపు, 2.15కోట్లు ఇంకొక వైపు. అమరావతి.. మొత్తం రాష్ట్రానికి నడిబొడ్డున ఉంటుంది.
- విశాఖపట్నం (జిల్లా) 10 జిల్లాలు ఒకవైపు.. 02 జిల్లాలు ఇంకోవైపు. దూరం 1000 కిలోమీటర్లు ఒకవైపు,100 కిలోమీటర్ల ఇంకో వైపు. జనాభా.. 3.5కోట్ల జనాభా ఒకవైపు 50 లక్షల జనాభా ఇంకొక వైపు. ఎమ్మెల్యేలు 141 మంది ఒకవైపు 19 మంది ఇంకోవైపు. ఏ రకంగా చూసినా విశాఖపట్నం అందరికీ అన్నిటికీ దూరంగా ఉంటుంది
- అమరావతి కృష్ణా నది ఒడ్డున ఉంది. నీటికి కొరత లేదు. విశాఖపట్నం నీటి కొరత ఉంది. అమరావతి ఇప్పటి జనాభా 1లక్ష లోపు మాత్రమే. ఎంత పెరిగినా 10 లక్షలకు మించదు. సమగ్రమైన ప్రణాళిక వుంది కాబట్టి కాలుష్యం ఉండదు. విశాఖపట్నం ఇప్పటి జనాభా 25లక్షలు. పెరిగి పెరిగి 50లక్షలు అవుతుంది. ఉన్న ఊరును పెంచుకుంటూ పోవటం వలన అస్తవ్యస్తంగా తయారవుతుంది. కాలుష్యం పెరిగిపోతోంది. ఏవిధంగా చూసినా అమరావతిలోని రాజధానిని కదిలించడం ముమ్మాటికీ కుటిలమైన రాజకీయ వికృత క్రీడ.. మూర్ఖత్వం.
- అమరావతిలో ఉన్నంత విశాలమైన రహదారులు ఢిల్లీలో కూడా లేవు. భూగర్భ కేబుల్ వ్యవస్థతో ఒక్క కరెంటు వైరు కూడా బయటకి కనిపించకుండా నిర్మించారు. భూమికి పాతిక అడుగుల క్రింద నిర్మించిన డ్రైనేజీ వ్యవస్థతో దోమలతో అపరిశుభ్రత వల్ల వచ్చే రోగాలు అమరావతి దరిదాపుల్లో కనిపించే అవకాశం లేదు. కనీసం అమెరికాలో కూడా ఇంత పక్కా ప్రణాళికతో నిర్మిస్తున్న నగరం లేదు.
- వచ్చే వందేళ్ల వరకు నీటికోసం చెన్నై, ముంబై, బెంగుళూరు నగరాల్లా కటకటలాడాల్సిన పని కూడా లేకుండా కృష్ణమ్మ ఒడ్డున భూదేవి సైతం నివ్వెరపోయేలా...ఆకాశం అచ్చెరువొందేలా ...ప్రపంచ దేశాలు మనవైపు చూసేలా, భూతల స్వర్గం అనిపించుకునేలా మన అమరావతి పునర్నిర్మాణం తధం. ఆంధ్రుల రాజధాని అమరావతి.
ఇదంతా చదివిన తర్వాత మీకేమనిపించిది? అమరావతి రాజధానిగా సవాలచ్చ సందేహాల్ని వ్యక్తం చేసేటోళ్లు.. విశాఖకు ఉన్న అనుకూలతలు.. మూడు రాజధానులతో ఎదురయ్యే కంగాళీలు.. ఇప్పటికైనా అర్థమవుతుందా? అన్నది అసలు ప్రశ్న.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.