ఈ సృష్టిలో జీవరాశి నివాసంకు యోగ్యమైనది కేవలం భూమి మాత్రమే. ఆ భూమిని మనుషులు స్వయంగా నాశనం చేస్తున్నారు. కాలుష్యం మరియు తదితర కారణాల వల్ల భూగోళం నానాటికి నాశనం అవుతుందని అంతర్జాతీయ స్థాయి శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఎప్పుడు లేని విధంగా ప్రకృతి వైపరిత్యాలు సంభవించడానికి కారణం గ్లోబల్ వార్మింగ్ అనే విషయం కాస్త పర్యావరణ జ్ఞానం ఉన్న వారికి కూడా తెలుసు. కాని వారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు కాని.. పర్యావరణంను తమ పరిధిలో ఉండే విషయాల పట్ల స్పందించడం కాని చేయడం లేదు. ఇలా ప్రతి ఒక్కరు కూడా భూగోళం నాశనంకు దారి తీసేలా చేస్తున్నారని శాస్తవేత్తలు అంటున్నారు.
కొన్ని సంవత్సరాల క్రితం జరిగిన పరిశోదనలతో కాలుష్య తీవ్రత 2100 సంవత్సరం వరకు భూగోళంను నాశనం చేయలేదని చెప్పారు. కాని ఇటీవల జరిగిన పరిశోదనతో 2100 తర్వాత కూడా పరిస్థితులు ఇలాగే కొనసాగితే మాత్రం ఆ తర్వాత ఎలాంటి చర్యలు తీసుకున్నా.. ప్రపంచం మొత్తం కాలుష్య నివారణకు గ్లోబల్ వార్మింగ్ ఆపేందుకు చర్యలు తీసుకున్న వృదా అంటూ నిపుణులు చెబుతున్నారు. 2100 సంవత్సరం తర్వాత ప్రపంచ వ్యాప్తంగా గ్లోబల్ వార్మింగ్ తో అనర్థాలు సంభవిస్తాయని అంటున్నారు. రాబోయే వంద ఏళ్లలో గ్లోబల్ వార్మింగ్ తగ్గించేందుకు ప్రయత్నాలు చేయాలని లేదంటే ఆర్కిటిక్ లో అతి శీతోష్టస్థితి లో ఉన్న మంచు కరగడం మొదలు అవుతుందని.. ఎప్పుడైతే అక్కడి మంచు కరగడం మొదలవుతుందో అప్పుడు మీథేన్ వాయువు విడుదల అవుతుంది.
మీథేన్ వాయువుతో వాతావరణం మరింత వేడి ఎక్కే ప్రమాధం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. భవిష్యత్తు తరాల వారికి ఇది చాలా ప్రమాదకరంగా మారే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు. 2050 నుండి 2075 సంవత్సరాల్లో వాతావరణ మార్పులను కాస్త అయినా నిరోదించేందుకు ప్రయత్నాలు చేయవచ్చు కాని 2100 తర్వాత జరగబోయే పరిణామాలను ఇప్పటి నుండి మాత్రమే నిలువరించగలం. అప్పటికప్పుడు అంటే సాధ్యం కాదని నిపుణులు చెబుతున్నారు.
వచ్చే నవంబర్ లో గ్లాస్గో లో జరుగబోతున్న అంతర్జాతీయ సమావేశంలో 26 దేశాలు పాలు పంచుకోబోతున్నాయి. ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో వాతావరణ మార్పుల గురించి అధ్యయనం చేసి ఐపీసీసీ బృందం ముసాయిదాను తయారు చేసింది. ఆ ముసాయిదా గురించి గ్లాస్గో సమావేశంలో చర్చించబోతున్నారు. ఆ ముసాయిదాలో పేర్కొన్న విషయాలపై ప్రపంచ వ్యాప్తంగా కూడా చర్చ జరగాల్సిన అవసరం ఉంది. అప్పుడైనా కనీసం పర్యావరణ పరిరక్షణ కు తమ వంతు ప్రయత్నాలు చేస్తారేమో చూడాలి.