జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇటీవలే అమెరికాలో పర్యటించిన సంగతి తెలిసిందే. డల్లాస్ లో ఆయన నిర్వహించిన సభ గురించి మీడియాలో.. సోషల్ మీడియాలో పెద్ద చర్చే నడిచింది. ఐతే ఆ సభ ముగిసిన వారం గడుస్తున్నా పవన్ ఇండియాలో అడుగుపెట్టలేదు. మరి అమెరికాలోనే ఇంకా పవన్ ఏం చేస్తున్నాడని పవన్ అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. ఐతే పవన్ ప్రస్తుతం అమెరికాలో లేడట. అట్నుంచి అటే యూరప్ వెళ్లాడట. ఇది కుటుంబ పర్యటన అని సమాచారం. తన భార్య లెజ్నోవా.. కొడుకు మార్క్ శంకర్ పవనోవిచ్ ల కోసమే పవన్ యూరప్ వెళ్లాడట.
క్రిస్మస్ వేడుకల్లో పాల్గొనడంతో పాటు కొడుక్కి క్రైస్తవ మతాచారాల ప్రకారం ఏవో కొన్ని కార్యక్రమాలు నిర్వహించాల్సి ఉండటంతో లెజ్నోవా ఇప్పటికే తన స్వస్థలానికి వెళ్లినట్లు సమాచారం. పవన్ సినీ.. రాజకీయ కమిట్మెంట్లలో ఎప్పుడూ పెద్దగా జోక్యం చేసుకోని లెజ్నోవా తన కోసం.. కొడుకు కోసం ఈసారి యూరప్ రాావాలని అడగడంతో పవన్ సరే అని అమెరికా నుంచి అక్కడికి చేరుకున్నట్లు సమాచారం. ఒక వారం రోజులు అక్కడే గడిపి.. ఆ తర్వాత నేరుగా అమరావతికి చేరుకుంటాడట పవన్. ఆపై ఎన్నికల వరకు పవన్ అమరావతిలోనే ఉండి రాజకీయం నడుపుతాడని.. పార్టీ నిర్మాణాన్ని పటిష్టం చేసి ఎన్నికల నాటికి బలంగా తయారవ్వాలని పవన్ యోచిస్తున్నాడని సన్నిహితులు అంటున్నారు.