మళ్లీ భీమవరం నుంచి పవన్ పోటీ.. గెలుస్తారా?

Update: 2022-12-25 10:04 GMT
జనసేనాని పవన్ కళ్యాణ్ మళ్లీ భీమవరంలో పోటీ చేస్తే ఏమవుతుంది?. మళ్లీ గెలుస్తారా? లేక పాత సీన్ రిపీట్ చేస్తారా అన్న ఆలోచనలు జనసేనలో సాగుతున్నట్టు సమాచారం.  పవన్ మళ్లీ భీమవరంలో పోటీ చేస్తే పక్కాగా గెలుస్తారని తేలింది.. వంద శాతం ఇది నిజమని జనసైనికులు అంటున్నారు.. దీనికి అనేక కారణాలున్నాయి. మొదటి కారణం కాపులే.. ఇప్పుడు కాపులు ఉన్నంత ఐక్యంగా గత 2019 ఎన్నికల్లో లేరు.

ఏకంగా కాపు సంఘాలు సభలు, సమావేశాలు పెట్టి జనసేన పార్టీకి మద్దతు తెలుపుదాం అని పిలుపునిస్తున్నారంటే తరువాత ఏం జరగబోతుందో మీరే అంచనా వేయవచ్చు.. అలాగే జనసేనకు మద్దతు తెలపడం ఇష్టం లేనివారుంటే ఈ సంఘం నుంచి వెళ్లిపోండని కాపు నాయకులు సంఘ సమావేశంలో బహిరంగంగా చెప్పడం అంటే మాటలు కాదు. ఎందుకంటే ఒక సామాజిక సంఘంలో అనేక పార్టీల నాయకులు, కార్యకర్తలు ఉండటం సహజం. మరి రాష్ట్ర స్థాయి సంఘం తమ నిర్ణయాన్ని సమావేశంలో బహిర్గతం చేసిందంటే కారణం ఇక వెతకాల్సిన పనిలేదనుకుంటా!.. సేనానికి ఏక పక్షంగా కాపు సంఘాలు సమావేశాలు పెడుతున్నాయంటే అది పవన్ క్రెడిబులిటి అని చెప్పవచ్చు.

-పవన్ పోరాట పటిమ...

గత ఎన్నికల్లో ఒక పార్టీ అధినేత, అదీ కాకుండా పశ్చిమ గోదావరి జిల్లా మా ఏరియా అని చెప్పుకునే ప్రాంతంలోనే పవన్ అతి స్వల్ప ఓట్లతో ఓటమినే కాదు, పరాభవాన్ని కూడా మూటగట్టుకోవాల్సి వచ్చింది. భీమవరంలో వైసీపీ అభ్యర్థి గ్రంథి శ్రీనివాస్.పై కేవలం 8,357 ఓట్ల తేడాతో పరాజయాన్ని చవిచూడాల్సి వచ్చింది. ఇక్కడ పవన్ 53 వేల 5 ఓట్లు కొల్లగొట్టగలిగారు.. దీనికి ఆయన కొంత బాధపడినప్పటికీ రాజకీయంగా కుంగిపోలేదు.. ఇప్పుడు ఆయన సన్నద్ధతను చూస్తే ఎవరికైనా అర్థమవుతుంది.. తనను మరింత బలంగా తానే నిర్మించుకున్నాడని.. గత ఎన్నికల్లో కాపు ఓట్లు గంపగుత్తుగా పడలేదు.

అయినప్పటికీ అన్ని వర్గాల ఓట్లను సాధించగలిగారు. అయితే ఈ సారి మాత్రం అలా లేదు. పవనే కాదు జనసేన పార్టీ నుంచి ఎవరు పోటీ చేసినా గెలుస్తారనే టాక్ వినిపిస్తోంది. తత్వం బోధపడిన అధికార పార్టీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ ఇప్పటికే సైలెంట్ అయిపోయారు. ఎదుకంటే కాపు అంటే పవన్, పవన్ అంటే కాపు అనే విధానం ఇప్పుడు మెల్లగా పాతుకుపోతోంది.

-కులం లేని అభిమానగణం..

ఇక్కడ మరో వర్గం ఉంది. అది వెలకట్టలేని వర్గం. ఆ వర్గమే పవన్ అభినవర్గం. ఇక వీరికి ఏ సంఘాల సమావేశాలు, సభలు, ఊదరగొట్టు ప్రసంగాలు అవసరం లేదు. ఒకటే మాట పవనిజం, గోదావరి జిల్లాల్లో పవన్ అభిమానులు ఎక్కువ ఎందుకంటే చిరంజీవి అభిమానులంతా తమ్ముడి మీదా తమ అభిమానాన్ని గుమ్మరిస్తుంటారు. అందుకే వీరంతా ఏక బిగువున సేనాని వెంటే ఉంటారు. తమ నాయకుడిని గెలిపించుకోవడానికి చివరి వరకు పోరాడతారు.

అయితే ఈ అభిమానానికి చెడ్డపేరూ లేకపోలేదు. ఆయా నియోజకవర్గాల్లో పార్టీ జెండాలు చేతబట్టి కొంత మొండిగా వ్యవహరిస్తున్నతీరే కొంత చెడ్డపేరును తెచ్చిపెడుతోంది.. దీనికి అడ్డుకట్ట పవన్ వల్ల కూడా కాదు. ఇక వాళ్లంతే ఎవరి మాటా వినరు. అభిమానులు కొంత డీసెంట్ గా వ్యవహరించగల్గితే జనసేనకు ఉన్న బాలారిష్టాలు కూడా తొలగిపోయినట్టే.. ఏది ఏమైతేనే సారి భీమవరం నుంచి పవన్ పోటీ చేస్తే ఇక మాటలుండవ్.. మాట్లాడుకోవటాలుండవ్ అనేది స్పష్టం..
Tags:    

Similar News