కేంద్రంలోని బీజేపీ సర్కార్ వచ్చాక కార్పొరేట్లు లాభపడ్డారని ప్రతిపక్షాలు ఆరోపిస్తుంటాయి. అందునా ప్రధాని మోడీ రాష్ట్రానికి చెందిన అంబానీలు, అదానీలు ప్రపంచంలోనే కోటీశ్వరులుగా ఎదిగారని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తుంటారు.అంబానీ, అదానీ.. ఈ ఇద్దరు గుజరాతీలు దేశ వ్యాపారరంగాన్ని అన్ని రంగాల్లో దున్నేస్తున్నారు. ఆసియాలోనే కుబేరులుగా ఎదిగారు. గుజరాత్ కే చెందిన మోడీ దేశంలో అధికారంలో ఉండడం.. వీరితో సాన్నిహిత్య సంబంధాలు ఉన్నాయన్న ప్రచారం ఉండడంతో వీరి వ్యాపారాలు ఆశాజనకంగా దూసుకెళ్తున్నాయని ఆరోపణలున్నాయి..
ప్రస్తుతం దేశంలోనే సంపన్నులు అంబానీ, అదానీ. ఇద్దరూ ఎప్పుడూ మార్కెట్ ను పసిగడుతూ వ్యాపారాలను విస్తరించి విజయాలు సాధించారు.ఇప్పుడు పరస్పరం పోటీపడుతున్నారు. నంబర్ 1 ర్యాంకు లక్ష్యంగా సాగుతున్న వీరి వ్యాపార ఫైట్ ఎటు దారితీస్తుందో చూడాలి. తాజాగా కుబేరుల జాబితా రిలీజ్ అయ్యింది. ఇందులో అంబానీయే మొదటిస్థానంలో నిలిచారు.
రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ మళ్లీ ఇండియా కుబేరుల్లో మొదటి స్థానంలో నిలిచారు. ఆయన సంపద అంతకంతకూ పెరుగుతూనే ఉంది. తాజాగా అంబానీ 90.7 బిలియన్ డాలర్ల సంపదతో మరోసారి ఫోర్బ్స్ ఇండియా బిలియనీర్స్ జాబితాలో టాప్ ప్లేసు దక్కించుకున్నాడు. ఆయన తర్వాత అదానీ గ్రూప్ చైర్మన్ గౌతం అదానీ 90 బిలియన్ డాలర్లతో రెండో స్థానంలో నిలిచారు.
ఇక వీరి తర్వాత 28.7 బిలియన్ డాలర్లతో 3వ ప్లేసులో హెచ్.సీ.ఎల్ చైర్మన్ శివ్ నాడార్ నిలిచారు. ఇక అంబానీ ప్రపంచంలోని ధనవంతుల్లో పదో స్థానాన్ని నిలబెట్టుకున్నారు.
ఈ ఇద్దరు గుజరాతీ వ్యాపారులు ఇప్పటిదాకా ఒకరి వ్యాపారంలో మరొకరు వేలు పెట్టలేదు. ఎవరి వ్యాపారాలు వారు బుద్దిగా చేసుకున్నారు. రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ పెట్రో రిఫైనరీలు, టెలికాం, రిటైల్ తదితర రంగాల్లో ఉంటే.. గౌతం అదానీ మాత్రం పోర్టులు, సరుకుల రవాణా, మెగా ప్రాజెక్టులు, మౌళిక సదుపాయాల రంగంలో వ్యాపారం చేశారు.
ఇద్దరి దారులు వేరు కావడంతో క్లాష్ కాలేదు. ఇప్పుడు నంబర్ 1 స్థానం కోసం మాత్రం వ్యాపారాలు విస్తరించే పనిలో ఉన్నట్టు సమాచారం. ఇద్దరూ గ్రీన్ ఎనర్జీపై పడ్డట్టు తెలిసింది.