ఆ వైసీపీ మ‌హిళా మంత్రి దూకుడు వెనుక వేరే రీజ‌న్ ఉందా...!

Update: 2022-09-13 04:46 GMT
కార‌ణం లేకుండా.. రాజ‌కీయ నేత‌లు ఏదీ చేయ‌రు. ఏం చేసినా.. దానివెనుక అర్ధం, ప‌ర‌మార్థం ఏదో ఒక‌టి ఉంటుంది. భ‌విష్య‌త్తును దృష్టిలో పెట్టుకునో.. లేక‌.. త‌మ కాళ్ల కింద‌కు నీళ్లు వ‌స్తాయ‌నో.. భావించే నాయ కులు దూకుడు చూపిస్తార‌నేది.. రాజ‌కీయాల్లో కామ‌న్ ఫ్యాక్ట‌ర్‌. ఇప్పుడు వైసీపీ స‌ర్కారు కేబినెట్‌లో దూకు డు మీదున్న ఓ మ‌హిళా మంత్రి విష‌యంలోనూ ఇదే టాక్ వినిపిస్తోంది.

గ‌త కేబినెట్‌లో చోటు ద‌క్కుతుంద‌ని ఆశించిన భంగప‌డిన ఆమె త‌దుప‌రి కేబినెట్‌లో చోటు ద‌క్కించుకు న్నారు. అయితే.. సాధార‌ణంగా.. మంత్రులు దూకుడు పెంచాల‌ని.. సీఎం జ‌గ‌న్ చెబుతున్నా.. చాలా మం ది సైలెంట్‌గానే ఉన్నారు. కానీ, ఈ మ‌హిళా మంత్రి మాత్రం త‌న శాఖ‌కు సంబంధించిన ప‌నుల విష‌యం లో అధికారులను, సిబ్బందని ప‌రుగులు పెట్టిస్తున్నారు. అంతేకాదు.. త‌న శాఖ‌పై వ‌చ్చే అవినీతి ఆరోప‌ణ ల‌ను కూడా స‌హించేది లేద‌ని అంటున్నారు.

దీంతో ఇప్పుడు జ‌గ‌న్ మంత్రి వ‌ర్గంలో ఆమె పేరు హాట్ టాపిక్ అయిపోయింది. ప్ర‌తిప‌క్ష పార్టీలు సైతం టార్గెట్ చేయ‌డానికి ఆస్కారం లేకుండా.. ఆమె వ్య‌వ‌హ‌రిస్తుండ‌డం గ‌మ‌నార్హం. ముఖ్యంగా ఇదే జిల్లాకు చెందిన మాజీ మంత్రి ఒక‌రిపై అనేక ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి.

ఆయ‌న మంత్రిగా ఉన్న స‌మ‌యంలో అవినీ తి జ‌రిగింద‌నే పేరు ఉంది. అయితే.. అదే నియోజ‌క‌వ‌ర్గం నుంచి ప్రాతినిధ్యం వ‌హిస్తున్న ప్ర‌స్తుత మ‌హి ళా మంత్రి మాత్రం ఎక్క‌డా అవినీతికి తావు లేకుండా.. ఆరోప‌ణ‌లు రాకుండా చూసుకుంటున్నారు.

దీనికి రెండు కార‌ణాలు క‌నిపిస్తున్నాయ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ఒక‌టి పార్టీలో త‌న సొంత నియోజ క‌వ‌ర్గంలో త‌న‌కు పోటీ లేకుండా చేసుకోవ‌డం ప్ర‌ధానంగా ఉంద‌ని అంటున్నారు. ఎందుకంటే.. ఆమె పెర్ఫార్మెన్స్ లో చిన్న‌తేడా వ‌చ్చినా.. టికెట్ ద‌క్కించుకునేందుకు మ‌రొక‌రు రెడీగా ఉన్నారు.

దీంతో ఆమె దూకుడు  ప్ర‌ద‌ర్శిస్తున్నార‌ని అంటున్నారు. ఇక‌, రెండో కార‌ణం.. తొలిసారి ఎమ్మెల్యే అయిన త‌న‌కు సీఎం జ‌గ‌న్ కీల‌క‌మైన శాఖ‌ను అప్ప‌గించ‌డం. దీనిలో గ‌ట్టి పెర్ఫార్మెన్స్ చూపించ‌డం ద్వారా.. ఆమె త‌నకు తిరుగులేద‌నే ముద్ర‌ను వేయించుకోవాల‌ని చూస్తున్న‌ట్టు తెలుస్తోంది. ఏదేమైనా.. ప్ర‌స్తుతం ఆ మ‌హిళా మంత్రి విష‌యంలో సీఎం జ‌గ‌న్ ఫీల్ గుడ్ అంటున్నార‌ట‌.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News