అసలు ఇంత కాలం జరిగిన ఆర్మీ ర్యాలీల వివరాలు ఏంటి ? వాటిలో అర్హతపొందిన అభ్యర్థులు ఎందరు ? అలా కాకుండా సిద్ధం అవుతున్న అభ్యర్థులు ఎందరు ? వీటితో పాటే ఇంకొన్ని ఆలోచించాలి. అగ్నిపథ్ పేరిట జరిగిన ఆందోళనల్లో ఎక్కడి నుంచి ఇంతమంది నిరసనకారులు వచ్చారు. ? ఇవే కాదు కేసులు లెక్క తేలాక యువకుల భవిష్యత్ ఏంటి ? అంతేనా ! ఆర్థిక నష్టం గురించి తెలుసుకుంటే కళ్లు చెమ్మగిల్లక మానవు. ఇంత ఘోరం ఇప్పటిదాకా ఏ నిరసనల్లోనూ జరగలేదు. అయినా కూడా ప్రధాన పార్టీలు తమ మొండివాదన వినిపిస్తూ, అభ్యర్థులను రెచ్చగొడుతున్నాయి. వాస్తవానికి అగ్నిపథ్ వద్దనుకుంటే వద్దు .. ఎవ్వరూ కాదనరు కానీ ప్రజల ఆస్తినష్టానికి కారకులు ఎవరు ?
అగ్నిపథ్ వద్దు అని క్రియెటివ్ గా పోస్టర్లు పెడుతున్న కొన్ని ఉప ప్రాంతీయ పార్టీలు (అధికారంలో ఉన్న) ఇంతకూ వారి పరిధిలో యువత కు ఇచ్చిన ఉద్యోగాలు ఎన్ని ? దీనిపై కూడా బీజేపీ తరఫు నుంచి సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.
యువత వద్దనుకోవడం వేరు.. ఆస్తులను నష్టం చేసేవిధంగా వారిని ఉద్రేక పర్చడం వేరు.. కనుక వీటిని ఉద్దేశ పూర్వక నేరాలుగానే తాము పరిగణిస్తామని భారతీయ రైల్వే తో సహా ఇతర రక్షణ దళాలు చెబుతున్నాయి. ఈ ఆర్గనైజ్డ్ క్రైం వెనుక ఇంకొందరు రాజకీయ నాయకులు (అధికారంలో ఉన్న మరియు అధికారం కావాలనుకుంటున్న) ఉన్నాయని తమకు వార్తలు వస్తున్నాయి అని దర్యాప్తు బృందాలు ఘోషిస్తున్నాయి. ఇంతకూ ఈ పాపం ఎవరిది ?
అగ్నిపథ్ పథకం పేరిట ఆర్మీలో ఇతర రక్షణ దళాలలో జరగబోయే రిక్రూట్మెంట్ ను నిరసిస్తూ, వ్యతిరేకిస్తూ దేశ వ్యాప్తంగా జరిగిన నిరసనల్లో ఏడు వందల కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందని తెలుస్తోంది. ఇప్పటిదాకా ఉన్న ప్రాథమిక సమాచారం ప్రకారం.. దేశం వ్యాప్తంగా జరిగిన ఈ నిరసనల్లో ఎక్కువగా నష్టపోయింది మన భారతీయ రైల్వేనే ! మొత్తం అరవై రైళ్లకు నిరసనకారులు నిప్పంటించారు. బీహార్ లో 11 ఇంజన్లను తగులబెట్టారు. ఇవి కాకుండా చాలా చోట్ల విలువైన ఆస్తుల విధ్వంసానికి పాల్పడ్డారు.
ఇప్పటిదాకా ఉన్న సమాచారం ప్రకారం దేశవ్యాప్తంగా గడిచిన మూడు రోజుల్లో మొత్తం 138 ఎఫ్ఐఆర్‌లు నమోదు చేయగా, 718 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.60 కోట్ల మంది ప్రయాణికులు తమ టిక్కెట్లను రద్దు చేసుకున్నారు. సీసీటీవీ, వీడియో ఫుటేజీల ద్వారా హింసకు పాల్పడుతున్న మరికొంత మందిని పోలీసులు పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.
ఇక రైల్వే అధికారులు చెబుతున్న వివరం ప్రకారం..ఒక జనరల్ భోగి నిర్మాణానికి రూ.80 లక్షలు ఖర్చు అవుతుంది. అదే స్లీపర్ కోచ్‌కు రూ.1.25 కోట్లు, ఏసీ కోచ్ రూ. 3.5 కోట్లు ఖర్చు అవుతుంది. ఇక ఒక రైలు ఇంజిన్‌ను తయారు చేసేందుకు ప్రభుత్వం అక్షరాల రూ. 20 కోట్లకు పైగా వెచ్చిస్తోంది. మొత్తంగా చూసుకుంటే 12 బోగీల రైలును ఏర్పాటుకు చేసేందుకు రూ. 40 కోట్లు, 24 కోచ్‌ల ట్రైన్ నిర్మించేందుకు రూ. 70 కోట్లకుపైనే ఖర్చు చేస్తోంది. ఒక్క సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లోనే జరిగిన ఆస్తినష్టం విలువ 30 కోట్ల రూపాయలకు పైగానే అని తేలింది.