షాకింగ్ : అఘోరా , అఘోరీ పెళ్లి .. !

Update: 2021-11-24 00:30 GMT
అఘోరా అంటే సాధారణంగా అందరికి కొంచెం ఆశ్చర్యం, ఒక్కింత భయం కలుగుతుంది. దీనికి ప్రధాన కారణం అఘోరాల విధివిధానాలే. అఘోరాల్లో కొందరు నగ్నంగా, చిన్న గుడ్డకట్టుకొని కనిపించడమే కాకుండా వారి రూపం కూడా భయాందోళనకు గురి చేస్తుంటుంది. అంతేకాకుండా ఈ అఘోరాలు కాలిన బూడిదను విభూతిగా పరిగణించి ఒళ్లంతా రాసుకోవడం, మానవ మృతదేహాలను తినడం లాంటి విపరీత చర్యలు చూసి భయం రావడం అనేది సహజమే.

తమిళనాడుకు చెందిన మణికందన్‌ అనే వ్యక్తి కాశీలో అఘోర ఉపాసన చేసి అఘోరాగా మారాడు. కాశీ లో అఘోర ఉపాసన చేసి తన సొంత గ్రామానికి వచ్చి జై అఘోర కాళీమాత విగ్రహాన్ని ఏర్పాటు చేసి పూజలు నిరవిహిస్తున్నాడు. సమాధుల వద్ద అఘోర పూజలు నిర్వహిస్తూ తన శిష్యులకు అఘోర ఉపాసన చేయిస్తున్నారు మణికంధన్.

ఈ క్రమంలో తన దగ్గర శిష్యులుగా ఉన్న అఘోరని మణికందన్ పెళ్లిచేసుకున్నారు. హిందూ సంప్రదాయం ప్రకారం తాళి కట్టి కలకత్తా కి చెందిన మహిళను వివాహం చేసుకున్నారు అఘోర మణికంధన్. మూడేళ్ల క్రితం ఆత్మశాంతి తన తల్లి దేహంపై కూర్చుని ప్రార్థనలు చేసిన ఘటన రాష్ట్రంలో తీవ్ర సంచలనం రేపింది.

అదేవిధంగా ఇటీవల అగ్ని ప్రమాదంలో మరణించిన శిష్యుడి మృతదేహంపై కూర్చొని అన్నమశాంతి పూజలు నిర్వహించారు. తాజాగా మరో విషయంతో సంచలనంగా మారారు. తాజాగా కలకత్తాకు చెందిన తన శిష్యురాలిని పెళ్లి చేసుకోవడం ఇప్పుడు సంచలనంగా మారింది. ప్రియాంక అనే మహిళ ఎనిమిదేళ్లుగా మణికందన్ వద్ద అగోరీలకు శిక్షణ ఇస్తోంది. ఈ నేపథ్యంలో అఘోరి గురువు మణికందన్‌తో ప్రియాంక వివాహం నిన్న తెల్లవారుజామున జరిగింది.

పెళ్లి సమయంలో వరుడు అగోరి మణికందన్, వధువు అగోరి ప్రియాంక శరీరమంతా జల్లులతో అఘోరి కోలంలోనే ఉండటం విశేషం. పెళ్లి చేసుకుని కరుప్పస్వామి విగ్రహానికి ప్రత్యేక పూజలు చేశారు. అంతకుముందు యజ్ఞం సందర్భంగా మృదంగం మోగిస్తూ తోటి అఘోరాలు శంఖం ఊపుతూ నాట్యాలు చేశారు. అఘోరి మణికందన్ గురువు సిద్ధార్థ్ వే మదురైపాల్సామి ఆధ్వర్యంలో వివాహం జరిగింది.



Tags:    

Similar News