ప్రధానమంత్రిగా అధికారంలోకి వచ్చిన కొన్ని రోజులకే స్వచ్ఛభారత్ పేరుతో మోడీ చేస్తున్న కృషి తెలిసిందే. ఆయన మానసపుత్రిక అయిన స్వచ్ఛభారత్ విషయంలో మోడీ ఇచ్చే ప్రాధాన్యత చాలా ఎక్కువ. స్వచ్ఛభారత్ కోసం కృషి చేస్తున్న వారు ఎవరైనా.. వారెంత చిన్న కార్యక్రమాన్ని చేపట్టినా.. తన దృష్టికి వచ్చిన వెంటనే దాన్ని అభినందించే తత్త్వం మోడీలో కాస్త ఎక్కువే.
అలాంటి ఆయనకు.. ఆయన మంత్రివర్గంలోని మంత్రివర్యులు ఒకరు తూట్లు పొడిచేలా వ్యవహరిస్తే మోడీ రియాక్షన్ ఎలా ఉంటుందన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది. స్వచ్ఛభారత్ ను ఉద్యమస్ఫూర్తిగా తీసుకెళుతున్న మోడీ తీరుకు భిన్నంగా కేంద్ర వ్యవసాయ శాఖా మంత్రి రాధా మోహన్ సింగ్ బహిరంగ మూత్ర విసర్జన చేసి అడ్డంగా బుక్ అయ్యారు.
ఆయన మూత్ర విసర్జన చేస్తున్న ఫోటో సోషల్ మీడియాలో హడావుడి చేస్తున్నాయి. కారు ఆపి.. సెక్యూరిటీ గార్డుల సంరక్షణలో ఉన్న కేంద్రమంత్రి మూత్ర విసర్జన చేస్తున్న ఫోటోలు ఇప్పుడు వైరల్ అయ్యాయి.
ఎక్కడ ఆయనీ పని చేశారన్న విషయం బయటకు రాలేదు. ఇంతకూ ఈ విషయానికి ఇంత ప్రాధాన్యత ఎందుకంటే.. బీజేపీ ఎంపీ ప్రియాంకా రావత్ సరయూ నదిలో ప్లాస్టిక్ బాటిల్ విసిరేసిన వీడియో వచ్చి విమర్శలు వెల్లువెత్తాయి. ఓపక్క స్వచ్ఛభారత్ అంటూ ప్రధాని మోడీ కిందామీదా పడుతుంటే.. మరోవైపు ఆయన మంత్రివర్గంలోని వారు.. సొంత పార్టీ నేతలు ప్రధాని స్ఫూర్తిని దెబ్బతీసేలా వ్యవహరించటం చర్చనీయాంశంగా మారింది. మరి.. మంత్రివర్యుల తీరుపై ప్రధాని ఎలా రియాక్ట్ అవుతారన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/