షాకింగ్ : మే 31 నాటికి ఆ ఒక్క జిల్లాలోనే 8 లక్షల కేసులు!

Update: 2020-04-24 11:50 GMT
ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా వైరస్ కబలిస్తున్న విషయం తెలిసిందే. కరోనా కట్టడిలో భాగంగా లాక్ డౌన్ విధించడంతో ప్రజలు ఇంటి నుండి బయటకు రావడంలేదు. అయినప్పటికీ కూడా కరోనా కేసులు భారీగా పెరిగిపోతున్నాయి. అటు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ రోజురోజుకు దేశంలో కరోనా వైరస్ బారిన పడుతున్న వారి సంఖ్య పెరిగిపోతునే ఉన్న విషయం తెలిసిందే. ఏకంగా దేశంలో 23 వేలకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

ఈ నేపథ్యంలో .. తాజా నివేదికల ప్రకారం గుజరాత్ రాజధాని అహ్మదాబాద్ లో మే 31 వ తేదీ నాటికి 8 లక్షల వరకు పాజిటివ్ కేసులు నమోదయ్యే అవకాశం ఉందని నగర మున్సిపల్ కమిషనర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అయన మాట్లాడుతూ .. ప్రస్తుతం కరోనా పాజిటివ్ కేసుల వేగం పెరుగుతోంది. నాలుగు రోజుల్లో కేసుల సంఖ్య రెట్టింపు అవుతోంది. ఇదే ట్రెండ్ కొనసాగితే అహ్మదాబాద్ జిల్లాలో మే 15 నాటికి మొత్తం 50వేల కరోనా కేసులు నమోదవుతాయి. ఆ లెక్కన చూస్తే మే 31 నాటికి 8 లక్షల కేసులు నమోదవుతాయి అని అన్నారు.

ఇప్పటి వరకు అహ్మదాబాద్ లో 1600 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ముంబై, ఢిల్లీ తరువాత అత్యధికంగా కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్న నగరంగా అహ్మదాబాద్. గుజరాత్‌ లోని మొత్తం కరోనా కేసుల్లో 60 నుంచి 65 శాతం వరకు కేసులు ఒక్క అహ్మదాబాద్ ‌లోనే నమోదవుతున్నాయి. గుజరాత్‌లో ప్రస్తుతం 2624 కరోనా కేసులు ఉన్నాయి. 112 మంది ప్రాణాలు కోల్పోయారు.
Tags:    

Similar News