పార్లమెంట్లో ఏపీలో అధికార ప్రతిపక్షాలు సహా పలు జాతీయ పార్టీలు ప్రవేశపెట్టి అవిశ్వాసం చర్చకు రాకుండా డ్రామా ఆడుతున్న తమిళనాడు అధికార పార్టీ అన్నాడిఎంకే తమిళనాట కూడా వాటిని కొనసాగించిందని పలువురు భగ్గుమంటున్నారు. తమిళనాడులో అన్నాడీఎంకే కార్యకర్తల డ్రామా కెమెరాకు చిక్కడంతో ఇలా భగ్గుమంటున్నారు. కావేరీ మేనేజ్ మెంట్ బోర్డు ఏర్పాటు చేయాలంటూ కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా అన్నాడీఎంకే శ్రేణులు ఒకరోజు నిరాహార దీక్ష చేసిన విషయం తెలిసిందే. అయితే ముందు దీక్షలు చేస్తూ వెనుక మాత్రం మందు - విందుతో జల్సాలు చేశారని వీడియోలు వైరల్ అవుతున్నాయి.
సుప్రీంకోర్టు ఇచ్చిన గడువులోగా కేంద్రం కావేరీ మేనేజ్ మెంటు బోర్డు (సీఎంబీ) ఏర్పాటు చేయనందుకు నిరసనగా... మంగళవారం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు అన్నాడీఎంకే రాష్ట్రవ్యాప్త నిరాహార దీక్షకు పిలుపునిచ్చింది. దీనిలో సీఎం పళనిస్వామి - డిప్యూటీ సీఎం పన్నీర్ సెల్వం సహా మంత్రులు - ఎమ్మెల్యేలు - పార్టీ నేతలు జిల్లా ప్రధాన కార్యాలయాల్లో దీక్షకు కూర్చున్నారు. ఇదే దీక్షలో అధికార అన్నాడీఎంకే చేసిన కొన్ని పనులు ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి. అయితే వెల్లూరు - కోయంబత్తూర్ - సేలంలాంటి జిల్లాల్లో పార్టీ కార్యకర్తలు ముందు వేదికపై నిరాహార దీక్షకు కూర్చుంటూ.. వెనుక మాత్రం మంచిగా మందు - బిర్యానీ లాగించడం కెమెరాలకు చిక్కింది. కేంద్రంపై ఒత్తిడి తీసుకు రాలేకపోతున్నారని ఇప్పటికే అధికార పార్టీపై తీవ్ర ఒత్తిడి ఉన్న నేపథ్యంలో ఇప్పుడీ వీడియోలు బయటకు రావడం మరిన్ని చిక్కుల్లోకి నెట్టింది. నిరాహార దీక్షల వేదికలకు దగ్గరగానే ఈ మందు, బిర్యానీ అడ్డాలు ఏర్పాటు చేసుకున్నారని ఇప్పటికే ఆయా పక్షాలు మండిపడుతున్నాయి.