తమిళనాడు అధికారపక్ష రాజకీయాలు ఒక్కసారి ఆసక్తికరంగా మారాయి. ఇప్పటికే మూడు ముక్కలైన అన్నాడీఎంకే పార్టీలో తాజాగా చోటు చేసుకున్న పరిణామాలు సంచలనంగా మారాయి. సీఎం కుర్చీలో కూర్చోబెట్టిన చిన్నమ్మకు దిమ్మ తిరిగిపోయేలా షాకిచ్చారు పళనిస్వామి. చిన్నమ్మ అక్క కొడుకు దినకరన్.. అన్నాడీఎంకే డిప్యూటీ సెక్రటరీ జనరల్ గా వ్యవహరిస్తున్నారు. అయితే.. ఈ రోజు సమావేశమైన అన్నాడీఎంకే పళనిస్వామి వర్గం దినకరన్ మీద వేటు వేస్తూ నిర్ణయం తీసుకుంది. పార్టీ డిప్యూటీ సెక్రటరీ జనరల్ గా దినకరన్ ఎన్నిక చట్టవిరుద్దమంటూ తీర్మానం చేసింది.
తాజా నిర్ణయంతో ఇంతకాలం పళని.. పన్నీరు వర్గాలు ఒక్కటి కావాలన్న దిశగా అడుగులు పడే అవకాశం ఉందని చెబుతున్నారు. అక్రమాస్తుల కేసులో శశికళ జైలుకు వెళ్లటం.. ఆమె వారసుడిగా దినకరన్ తెర మీదకు రావటం తెలిసిందే. అమ్మ మరణం నేపథ్యంలో జరగాల్సిన ఉప ఎన్నికల వేళ.. పార్టీ గుర్తు కోసం చేసిన లోగుట్టు ప్రయత్నాలు బయటకు రావటంతో.. ఆయన అరెస్ట్ కావటంతో అన్నాడీఎంకేలో సమీకరణాలు మారిపోయాయి. చిన్నమ్మ నమ్మకస్తుడిగా.. ప్రధాన అనుచరుడిగా సీఎం పదవిని చేపట్టిన ఎడపాడి పళనిస్వామి ఇప్పుడు స్వతంత్రంగా వ్యవహరిస్తూ.. అధికారపార్టీని తన చేతల్లోకి తెచ్చుకున్నారు. అన్నాడీఎంకేలో మరో కీలక వర్గంగా ఉన్న పన్నీరు సెల్వంతో సయోధ్య దిశగా అడుగులు వేస్తున్న ఆయన.. ఇద్దరు కలవటం ద్వారా అధికారాన్ని సుస్థిరం చేయాలని భావిస్తున్నారు.
ఇందులో భాగంగా దినకరన్ ను అడ్డు తొలగించే ప్రయత్నాలు మొదలెట్టారన్న వాదన వినిపించింది. దీనికి బలం చేకూరుస్తూ తాజా పరిణామాలుచోటు చేసుకున్నాయి. దినకరన్ పై పళనిస్వామి వర్గం వేసిన వేటుతో పన్నీరు సెల్వం వర్గంతో విలీనానికి మార్గం సుగుమం అయ్యిందన్న భావన వ్యక్తమవుతోంది. ఇదిలా ఉంటే.. పళనిస్వామి వర్గం తీసుకున్న నిర్ణయం దినకరన్ అండ్ కోలకు దిమ్మతిరిగిపోయే షాకిచ్చింది. పళనిస్వామి తీరుపై ఆయన నిప్పులు చెరుగుతున్నారు. తాజా పరిణామాలతో తమిళనాడు రాజకీయాలు మరోసారి ఆసక్తికరంగా మారాయి.