ఎయిమ్స్ డాక్టర్లు వచ్చేశారు!

Update: 2016-10-06 07:34 GMT
తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత అనారోగ్యం ఎంతటి సంచలనాన్నిసృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దేశ వ్యాప్తంగా అమ్మ ఆరోగ్యం గురించి పెద్ద ఎత్తున చర్చే నడిచింది. ఆమె ఆరోగ్యం ప్రమాదకర పరిస్థితుల్లో ఉందని కొందరు.. లేదు లేదు కోమాలోకి వెళ్లిపోయారని ఇంకొందరు..మరికొందరు అత్యుత్సాహంతో బ్రెయిన్ డెడ్ అంటూ సోషల్ మీడియా సాక్షిగా పిచ్చిపిచ్చిగా ప్రచారం చేసినోళ్లు ఉన్నారు. ఇలాంటి వార్తలతో తమిళనాడులో తీవ్ర కలకలం రేగింది. అయితే.. సోషల్ మీడియా కంటే కొన్ని వేల రెట్లు సంయమనంతో వ్యవహరించిన మీడియా పుణ్యమా అని.. లేనిపోని గందరగోళాలు చోటు చేసుకోలేదని చెప్పాలి.

అమ్మకు వైద్యం అందించేందుకు లండన్ నుంచి ప్రత్యేకంగా డాక్టర్ రిచర్డ్ బీలే రావటం.. ఆమె ఆరోగ్య పరిస్థితి మీద మూడు.. నాలుగు రోజులు శ్రమించి..చివరకు ఆమె కోలుకున్నాక.. తన అవసరం లేదని తేలిన తర్వాత ఆయన లండన్ వెళ్లిపోవటం తెలిసిందే. లండన్ నుంచి వ‌చ్చి వైద్యం చేసిన రిచర్డ్  వెళ్లిపోయిన తర్వాత..అమ్మ ఆరోగ్యాన్ని చూసుకునేందుకు ప్రఖ్యాత ఎయిమ్స్ నుంచి నలుగురు వైద్యులు చెన్నైకి చేరుకోవటం గమనార్హం.

ఎయిమ్స్ నుంచి చెన్నైకి వచ్చిన వైద్యుల్ని చూస్తే.. వారిలో కార్డియాలజిస్ట్ డాక్టర్ నాయక్.. పల్మనాలజీ నిపుణులు కీర్మాణీ..  అనెస్థటిక్ ఇంటెన్సివిస్ట్ డాక్టర్ అంజన్ తో పాటు మరొకరు ఉన్నారు. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం అమ్మ ఆరోగ్యానికి వచ్చిన ముప్పు ఏమీ లేదని.. ఆమె త్వరలోనే కోలుకోవటం ఖాయమని చెబుతున్నారు. కాకుంటే.. ఆమె మరికొన్ని రోజులు ఆసుపత్రిలోనే ఉండాల్సి ఉంటుందని స్పష్టం చేస్తున్నారు. కొద్ది వారాల తర్వాత ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయినప్పటికీ..దాదాపు రెండు నెలల పాటు అమ్మకు బెడ్ రెస్ట్ అవసరమంటూ చెబుతున్నారు. అంతేకాదు.. కొద్దిరోజులుగా ఆహారం తీసుకోకపోవటం.. అమ్మకు చేసిన వైద్యం కారణంగా..తమిళనాడు ముఖ్యమంత్రి బరువు దాదాపు పది కేజీలకు పైనే తగ్గుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. బరువు సంగతి ఎలా ఉన్నా.. అమ్మ ఆరోగ్యంగా మారిపోతే చాలు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News